హోమ్ /వార్తలు /సినిమా /

సర్కారు వారి పాట రికార్డుల మోత.. మహేష్ బాబు ఈ సారైనా ఆ పని చేస్తాడా..

సర్కారు వారి పాట రికార్డుల మోత.. మహేష్ బాబు ఈ సారైనా ఆ పని చేస్తాడా..

కరోనా కంటే ముందు నుంచి కూడా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకున్న ఈయన మార్చ్ వరకు ఖాళీగానే ఉండాలనుకున్నాడు.. అయితే కరోనా కారణంగా మరో ఆర్నెళ్లు ఎక్కువే రెస్ట్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పటికి కూడా మహేష్ షూటింగ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

  ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ప్రీ రిలీజ్ చేస్తే సంచలనం రేపింది. సోషల్ మీడియాలో విడుదలైన కాసేపటికే ఏకంగా 10 లక్షల మంది దీన్ని షేర్ చేసారు. ఇది సరికొత్త రికార్డు.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ మరోసారి నిరూపించుకున్నాడు సూపర్ స్టార్. అంతేకాదు 24 గంటల్లో ఎక్కువ మంది షేర్ చేసిన ప్రీ లుక్‌గా ఈ సినిమా పోస్టర్ రికార్డులకు ఎక్కింది.  పరుశురామ్ ఈ సినిమాను తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీ చేస్తాడనకుంటే.. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

  ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్‌లో కొన్ని బాగా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. మహేష్ బాబు చెవిపోగు అందులో ఒకటి. ఇప్పటి వరకు ఏ సినిమాలో లేనంత కొత్తగా ఈ చిత్రం కోసం పూర్తిగా మారిపోయాడు మహేష్ బాబు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది.  ముఖ్యంగా మహేష్ బాబు చెవిపోగు అదిరిపోయింది. అన్నింటికి మించి మెడపై రూపాయి కాయిన్ టాటూ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్ర కథ ప్రకారం ఆర్థిక నేరాలు చేసే పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.

  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

  అంతేకాదు మహేష్ బాబు తొలిసారి మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలిసారి మూడు పాత్రల్లో ఎలా మెప్పిస్తాడా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా మాత్రమే ద్విభాష చిత్రంగా తెరకెక్కింది. కానీ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుకు కన్నడతో పాటు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకులకు కూడా మహేష్ బాబు ఎపుడో దగ్గరయ్యాడు. ఇక మలయాళంలో కూడా మహేష్ బాబుకు కాస్తో..కూస్తో క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాతోనే మహేష్ బాబు తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో తన లక్‌ను పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్‌తో కలిసి జిఎంబీ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు మహేష్ బాబు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, Mahesh babu, Sarkaru Vaari Paata, Tollywood

  ఉత్తమ కథలు