హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata Collections: 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ ఇది.. చిచ్చుపెట్టిన మైత్రి కొత్త పోస్టర్‌

Sarkaru Vaari Paata Collections: 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ ఇది.. చిచ్చుపెట్టిన మైత్రి కొత్త పోస్టర్‌

‘సర్కారు వారి పాట’  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)

సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయంలో ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ అభిమానుల నడుమ ఆన్ లైన్ ఫైట్‌ని పెద్దది చేస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఇది మరోసారి ఫ్యాన్స్ నడుమ చిచ్చు పెట్టినట్లయింది.

ఇంకా చదవండి ...

అదేంటో మహేష్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata)పై నడుస్తున్న ట్రోల్స్ అస్సలు ఆగడం లేదు. విడుదల రోజు మొదలైన ట్రోలింగ్ ఆన్ లైన్ మాద్యమాలపై రచ్చ చేస్తూనే ఉంది. మహేష్ ఫ్యాన్స్ Vs పీకే ఫ్యాన్స్ అన్నట్లుగా ఫైట్ నడుస్తుండటం చూస్తున్నాం. చిత్ర కలెక్షన్స్ విషయమై మైత్రి బ్యానర్ వారు ఏ పోస్టర్ రిలీజ్ చేసిన దానిపై వెంటనే అటాక్ షురూ అవుతుండటం చర్చనీయాంశం అయింది. సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయంలో ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ అభిమానుల నడుమ ఆన్ లైన్ ఫైట్‌ని పెద్దది చేస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఇది మరోసారి ఫ్యాన్స్ నడుమ చిచ్చు పెట్టినట్లయింది.

కరోనా పరిస్థితుల తర్వాత బిగ్గెస్ట్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే మే 12న విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకొని అన్ని ఏరియాల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా కలెక్షన్ రిపోర్ట్స్‌తో కూడిన పోస్టర్స్ వదులుతున్నారు మేకర్స్. ఇదే ట్రోలింగ్‌కి కీ పాయింట్ అవుతోంది. అవన్నీ తప్పుడు లెక్కలు అంటూ కొంతమంది అటాక్ చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా మా సర్కారు వారి పాట నిలిచిందని పేర్కొంటూ మైత్రి మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో విడుదలైన 12 రోజుల్లోనే ఈ సర్కారు వారి పాట సినిమా 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పేర్కొన్నారు. సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ మూవీ నిలిచిందని తెలిపారు. ఇది చూసిన నెటిజన్లు మరోసారి అటాక్ షురూ చేశారు. దీంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ Vs మహేష్ ఫ్యాన్స్ అన్నట్లుగా మారిపోయింది సీన్. అలా పోస్టర్ రాగానే ఇలా మొరగడానికి కుక్కలు రెడీగా ఉంటాయి అని అర్థం వచ్చేలా కొన్ని పిక్స్ వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్స్.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందు నుంచే ఆసక్తిరేకెత్తించే అప్‌డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. విడుదల రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ క్రమంగా డౌన్ అవుతున్నాయి.

First published:

Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, మహేష్ బాబు, సర్కారు వారి పాట

ఉత్తమ కథలు