Home /News /movies /

SARKARU VAARI PAATA 4TH DAY WORLD WIDE COLLECTIONS SUPER STAR MAHESH BABU GOT DECENT COLLECTIONS TA

Sarkaru Vaari Paata 4 Days WW Collections : ’సర్కారు వారి పాట’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. వీకెండ్‌ను క్యాష్ చేసుకున్న మహేష్ బాబు..

Sarkaru Vaari Paata 4 Day f WW Collections ( Photo : Twitter)

Sarkaru Vaari Paata 4 Day f WW Collections ( Photo : Twitter)

Sarkaru Vaari Paata 4 Days WW Collections  :  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట. ఈ గురువారం వాల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. నిన్నటితో వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా 4 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Sarkaru Vaari Paata 4 Days WW Collections  : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే మధ్య డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ వచ్చింది.అంతేకాదు వీకెండ్‌ను బాగానే క్యాష్ చేసుకుంది.   ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

    హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. నిన్నటితో యూఎస్‌లో 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.  దీంతో  చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

    Acharya : ఆచార్య సహా భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..


    సర్కారు వారి పాట తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్ ..

    Day 1 :  రూ. 36.01 కోట్లు
    Day 2 : రూ. 11.04 కోట్లు
    Day 3 : రూ. 12.01  కోట్లు
    Day 4 : రూ. 12.06 కోట్లు
    తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : రూ. 71.12 కోట్లు / (రూ.  102.60 కోట్లు)

    నైజాం (తెలంగాణ):  రూ. 27.55 కోట్లు / రూ. 36కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 8.82 కోట్లు / రూ.  13 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 9.37 కోట్లు / రూ.  12.50 కోట్లు
    ఈస్ట్: రూ. 6.49 కోట్లు / రూ. 8.50 కోట్లు
    వెస్ట్: రూ. 4.15 కోట్లు / రూ. 7 కోట్లు
    గుంటూరు: రూ. 7.51 కోట్లు / రూ. 9 కోట్లు
    కృష్ణా : రూ.4.52 కోట్లు / రూ. 7.5 కోట్లు
    నెల్లూరు: రూ. 2.71 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 71.12 కోట్లు (రూ. 102.60 కోట్ల గ్రాస్ ) / రూ. 96.50 కోట్లు

    కర్ణాటక + రెస్టాఫ్ భారత్  : రూ. 4.60 కోట్లు / రూ. 11.50 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 10.15 కోట్లు / రూ. 11 కోట్లు                                                                                          ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85.87 కోట్లు (రూ. 133.80 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు  మొత్తంగా ఈ సినిమా రూ. 35.13 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.

    World Wide Highest Share Movies On Day 1 : ‘సర్కారు వారి పాట’ సహా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..


    1st Day WW Share రూ. . 45.21 కోట్లు (70 కోట్ల గ్రాస్ )
    2nd Day WW Share రూ. .: రూ. 13. కోట్లు ( రూ.  20 కోట్లు గ్రాస్)
    3rd Day WW Share రూ. .: రూ. 14.01 కోట్లు (రూ.  22 కోట్లు)
    4th Day WW Share రూ. .: రూ. 13.65 కోట్లు (రూ. 21.80 కోట్లు)
    ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 85.87 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 35.13 వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి.


    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో  వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    తదుపరి వార్తలు