Home /News /movies /

SARKARU VAARI PAATA 1ST DAY WORLD WIDE COLLECTIONS SUPER STAR MAHESH BABU GOT ANOTHER SUCCESS TA

Sarkaru Vaari Paata 1st Day WW Collections : ’సర్కారు వారి పాట’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

Sarkaru Vaari Paata 1st Day WW Collections  :  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట. ఈ గురువారం వాల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత వసూళ్లు రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Sarkaru Vaari Paata 1st Day WW Collections  : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. హీరోగా 27వ చిత్రం. నటుడిగా 36వ సినిమా.తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

    హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. దీంతో  చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

    Nizam 1st Day Top Share Movies : తెలంగాణ (నైజాం)లో ఫస్ట్ డే నాన్ RRR రికార్డులు బద్దలు కొట్టిన ’సర్కారు వారి పాట’..


    నైజాం (తెలంగాణ):  రూ. 12.24 కోట్లు / రూ. 36కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 4.70 కోట్లు / రూ.  13 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 3.74 కోట్లు / రూ.  12.50 కోట్లు
    ఈస్ట్: రూ. 3.25 కోట్లు / రూ. 8.50 కోట్లు
    వెస్ట్: రూ. 2.74 కోట్లు / రూ. 7 కోట్లు
    గుంటూరు: రూ. 5.83 కోట్లు / రూ. 9 కోట్లు
    కృష్ణా : రూ.1.95 కోట్లు / రూ. 7.5 కోట్లు
    నెల్లూరు: రూ. 1.56 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 36.01 కోట్లు / రూ. 96.50 కోట్లు

    కర్ణాటక + రెస్టాఫ్ భారత్  : రూ. 2.70 కోట్లు / రూ. 11.50 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 6.50 కోట్లు / రూ. 11 కోట్లు                                                                                            ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 45.21 కోట్లు (రూ. 70 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు  మొత్తంగా ఈ సినిమా రూ. 74.79 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.

    AP - TG 1st Day Top Share Movies : తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ’సర్కారు వారి పాట’ కలెక్షన్స్.. ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..


    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో  వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు