Home /News /movies /

SARKARU VAARI PAATA 11 DAYS WORLD WIDE COLLECTION REPORT HERE SLB

సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. ఆదివారం థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే?

Photo twitter

Photo twitter

భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్కారు వారి పాట సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని దేశ విదేశాల్లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే క్రమంగా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. తొలివారంతో పోల్చితే రెండో వారంలో వసూళ్ళలో డ్రాప్ కనిపించినా నిన్న 11వ రోజు పర్వాలేదనిపించింది.

ఇంకా చదవండి ...
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్ (Parashuram) దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మూవీ థియేటర్ల వద్ద సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది. భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని దేశ విదేశాల్లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ క్రమంగా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. తొలివారంతో పోల్చితే రెండో వారంలో వసూళ్ళలో డ్రాప్ కనిపించినా నిన్న 11వ రోజు పర్వాలేదనిపించింది. ఆదివారం సెలవుదినం కావడంతో అన్ని ఏరియాల్లోనూ కొద్దిమేర వసూళ్లు పుంజుకున్నాయి. మరి ఏయే ఏరియాలో వసూళ్లు ఎలా ఉన్నాయి? సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకెంత రాబట్టాలి? టోటల్ రిపోర్ట్ చూద్దామా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే..
డే 1: 36.01Cr
డే 2: 11.04Cr
డే 3: 12.01Cr
డే 4: 12.06Cr
డే 5: 3.64Cr
డే 6: 2.32Cr
డే 7: 1.82Cr
డే 8: 1.79Cr
డే 9: 1.40Cr
డే 10: 1.58Cr
డే 11: 2.40Cr
మొత్తంగా ఈ 11 రోజుల్లో కలిపి 86.07CR షేర్ రాగా 129.15CR గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక ఇతరరాష్ట్రాలు, ఓవర్‌సీస్ కలుపుకొని చూస్తే 104.68CR నెట్, 167.80CR గ్రాస్ వచ్చిందని తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగిన ఈ మూవీ ఇప్పటికి 100 కోట్ల మార్క్ దాటేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు మరో 17 కోట్ల మేర కలెక్షన్స్ రావాలి.

బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బాణీలు కట్టారు. చిత్రంలో సాంగ్స్ మేజర్ అసెట్ కావడమే గాక థమన్ ఖాతాలో మరో మ్యూజికల్ హిట్ పడింది. ఇక ఈ చిత్ర కలెక్షన్స్ విషయంలో ట్రోల్స్ నడుస్తూనే ఉండటం మరో అంశం. వసూళ్ల విషయంలో మైత్రి మేకర్స్ ఫేక్ రిపోర్ట్స్ చూపిస్తున్నారంటూ ట్విట్టర్‌లో రచ్చ నడుస్తోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, మహేష్ బాబు

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు