Home /News /movies /

SARKARU VAARI PAAT SUCCESS MEET VENUE CHANGED TO KURNOOL SB

Sarkaru Vaari Paat Success Meet: విజయవాడలో కాదు.. కర్నూలుకు వేదిక మార్పు

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

Sarkaru Vaari Paat Success Meet:కర్నూలు విషయంలో మహేష్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ తీసిన సినిమాలు హిట్ అవ్వడంతో... మహేష్‌కు కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ ఉంది.

    సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదల అయ్యి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ వేడుకలని విజయవాడలో చేస్తున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు.

    మరి ఈ సినిమా సక్సెస్ పై ఒక భారీ ఈవెంట్ ని చేస్తున్నట్లు గా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మే 16 సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ విజయవాడలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు. దీనితో ఈ సక్సెస్ మీట్ కోసం అభిమానులు మంచి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వేడుకల వేదికని మార్చినట్టుగా మేకర్స్ తెలిపారు. కర్నూల్ ఎస్ టి బి సి కాలేజ్ గ్రౌండ్స్ లో అదే మే 16న సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో అభిమానులు అయితే ఇది గమనించాలి. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదట ఈ సినిమా కాస్తా మిక్సుడ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు ఓ రేంజ్’లో అందుకోగా,.. సినిమా రెండో రోజు మాత్రం కాస్తా తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓ రేంజ్‌లో దుమ్ము లేపిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kurnool, Mahesh Babu, Sarkaru Vaari Paata

    తదుపరి వార్తలు