సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... సిినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జనవరి 11న ఈ సినిమా విడుదలైంది. థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుంది. దీంతో మూవీ టీం అంతా ఫుల్ జోష్లో ఉంది. బ్లాక్ బస్టర్ పార్టీ జరుపుకుంది. ఈ పార్టీలో మహేష్, నమత్రతతో పాటు, కూతురు సితార, విజయశాంతి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రష్మిక, రాజేంద్ర ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, నిర్మాత అనిల్ సుంకర, సంగీత మొదలైన వారు పాల్గొన్నారు. ఈ ఫోటోను... మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. బ్లాక్ బస్టర్ పార్టీ, సెలబ్రేషన్ బిగిన్స్ అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది తొలి విజయం సాధించిన మహేష్ ఇదే ఉత్సాహంతో త్వరలో వంశీ పైడిపల్లితో కలిసి తన నెక్ట్స్ సినిమా చేయనున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.