SARILERU NEEKEVVARU TRAILER TALK MAHESH BABU OUT AND ENTERTAINER TA
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ టాక్.. సంక్రాంతికి దద్దరిల్లిందిగా..
‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ టాక్ (Youtube/Credit)
మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసారు.
మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అనిల్ రావిపూడి.. మహేష్ బాబు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని..తనదైన కామెడీ స్టైల్లో ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించాడు.
ట్రైలర్ చూస్తుంటే.. ఫస్టాఫ్ కామెడీ ట్రాక్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కామెడీ హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత పూర్తిగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించాడు. అంతేకాదు విజయశాంతి పాత్ర కూడా ఈ సినిమాకు వెన్నుముక. మరోవైపు మహేష్ బాబును ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్‌గా ప్రకాష్ రాజ్ మరోసారి తన విలనిజం పండించాడు. మొత్తంగా కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని నిలిచాడు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే.. మహేష్ బాబు ఈ సంక్రాంతికి మరో హిట్ అందుకునేలా కనబడుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కృష్ణ కూడా మరో ముఖ్యపాత్రలో కనిపించాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.