మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ కామెడి 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్‌కు జంటగా రష్మిక మందన నటిస్తోంది. లేడి సూపర్ స్టార్ విజయశాంతి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి తోడు వరుస హిట్లతో సూపర్ క్రేజ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాను దర్శకత్వం వహించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ ఆర్మీ మేజర్ గా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. కాగ ఇటీవలే విడుదలై టీజర్లో మహేష్ ఆర్మీ ఆఫిసర్‌గా అదరగొట్టాడు. అది అలా ఉంటే భారత ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఓ పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దాన్నే సరిలేరు నీకెవ్వరు అంతెంగా పిలుస్తున్నారు. అందులో భాగంగా ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే విడుదలై ఆ పోస్టర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పోస్టర్ లో ఓ వ్యక్తి గుబురు గడ్డంతో ఇండియన్ ఆర్మీ డ్రెస్‌లో ఉన్నాడు. దీంతో అసలు ఆర్మీలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? పోస్టర్ రిలీజ్ చేసేముందు ఆ మాత్రం జాగ్రత్త తీసుకొకుండా ఎలా అంటూ.. భారత ఆర్మీను సరిలేరు నీకెవ్వరు టీం అవమాన పరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.