Home /News /movies /

SARILERU NEEKEVVARU SUCCESS MEET IN WARANGAL ON 17TH JANUARY AK

వరంగల్‌లో సరిలేరు నీకెవ్వరు సక్సెస్ సెలబ్రేషన్స్

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ పోస్టర్ (Twitter Image)

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ పోస్టర్ (Twitter Image)

ఇప్పటికే వసూళ్లపరంగా వంద కోట్ల క్లబ్‌లో చేరుకున్న ఈ నయా మూవీలో... మహేశ్ బాబు కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

    సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వసూళ్లపరంగా వంద కోట్ల క్లబ్‌లో చేరుకున్న ఈ నయా మూవీలో... మహేశ్ బాబు కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ సైతం ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఈనెల 17న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్, హీరోయిన్ రష్మిక మందానతో పాటు విజయశాంతి, ఇతర ముఖ్య నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ వేడుకకు మహేశ్ బాబు అభిమానులు, మూవీ లవర్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mahesh babu, Sarileru Neekevvaru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు