SARILERU NEEKEVVARU SECOND SINGLE MIND BLOCK LYRICAL SONG RELEASED AND MAHESH BABU IN FULL MASS AVATAR PK
సరిలేరు నీకెవ్వరు సాంగ్ రిలీజ్.. బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్..
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మొన్న టీజర్ నుంచే రచ్చ మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు వరసగా ఐదు సోమవారాలు ఐదు పాటలు విడుదల చేసి సినిమాపై మరిన్ని అంచనాలు..
సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మొన్న టీజర్ నుంచే రచ్చ మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు వరసగా ఐదు సోమవారాలు ఐదు పాటలు విడుదల చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ పెద్దగా ప్రభావం చూపించలేదు. మరోవైపు అల్లు అర్జున్ సామజవరగమనా సినిమా పాటలు దూసుకెళ్లిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకొస్తున్నారు సరిలేరు నీకెవ్వరు దర్శక నిర్మాతలు. జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
ఈ క్రమంలోనే డిసెంబర్ 2న తొలి సోమవారం మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. పక్కా మాస్ బీట్తో సాగిపోయే ఈ పాట మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. పైగా లుంగీ కట్టుకుని మహేష్ కూడా తన స్వరాన్ని కలిపాడు. మధ్యలో కొన్ని లిరిక్స్ చెబుతూ ఆకట్టుకున్నాడు. దేవీ మరోసారి మాస్ మ్యూజిక్‌తో రచ్చ చేసాడు.. దానికే కాస్త ర్యాప్ కూడా ఇచ్చాడు ఈ సంగీత దర్శకుడు.
గతంలో దేవీ పాటలతో పోలిస్తే కాస్త కొత్తగా ఉంది ఈ పాట. మైండ్ బ్లాక్.. బాబూ నీ మాస్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్.. నువ్వు స్టెప్పేస్తే మైండ్ బ్లాక్ అంటూ అనిల్ రావిపూడి కూడా పక్కా మాస్ పాట రాయించుకున్నాడు. రేపు వీడియో విడుదలైన తర్వాత పక్కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.