‘సరిలేరి నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నా.. మెగాస్టార్ చిరంజీవికి పబ్లిక్‌గానే బిస్కెట్ వేసింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చూస్తుండగానే...
‘సరిలేరి నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నా.. మెగాస్టార్ చిరంజీవికి పబ్లిక్‌గానే బిస్కెట్ వేసింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చూస్తుండగానే... ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ.. నాకు మెగాస్టార్ చిరంజీవి లక్కీ అని ఈ సందర్భంగా ప్రస్తావించింది. రష్మిక మందన్న తొలిసారి తెలుగులో హీరోయిన్గా నటించిన ‘ఛలో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిందని ఈ సందర్భంగా రష్మిక మాట్లాడింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’ సినిమా కూడా చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఇపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు కూడా మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ సినిమ ా కూడా హిట్ అవుతుందని రష్మిక మందన్న స్టేజ్ పై చిరంజీవిని పొగడ్తతలో ఓ రేంజ్లో ముంచెత్తింది. అంతకు ముందు ఈవెంట్‌కు లేట్‌గా హాజరైన రష్మిక మందన్న .. చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు ఈవెంట్‌కు లేట్‌గా హాజరైనందకు క్షమాపణలు కోరడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.