సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుసగా సక్సెస్‌లు లేవు. ఒక సినిమా సక్సెస్ అయితే.. ఇంకో సినిమా ఫ్లాప్ అంటూ కొనసాగింది. కానీ గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘భరత్ అను నేను’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన మహేష్ బాబు ... ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’తో వరుసగా రెండో సక్సెస్ అందుకున్నాడు. ‘భరత్ అను నేను’ మూవీతో రూ.90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్ బాబు...‘మహర్షి’ సినిమాతో రూ.105 కోట్ల షేర్ రాబట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు రివీల్ చేసారు.
ఈ సినిమాలో మహేష్ బాబు.. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే కాశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మేజర్ అజయ్ కృష్ణగా ఉగ్రవాదులను ఏరిపారేసే సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు.‘పోకిరి’లో కృష్ణ మనోహర్’ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు.. ‘దూకుడు’లో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’లో పోకిరిలో కృష్ణ, దూకుడులో అజయ్ కలిపి మేజర్ ‘అజయ్ కృష్ణ’గా అలరించనున్నాడు. మొత్తానికి తండ్రి పేరులోని ఉన్న కృష్ణను మరోసారి తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకొని బాక్సాఫీస్ దగ్గర తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు.
మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)
మేజర్ అజయ్ కృష్ణకు దేశం బయట పొంచి ఉన్న శతృవుల కన్నా అంతర్గత శతృవులతోనే ఈ దేశానికి ప్రమాదం అని గ్రహిస్తున్నాడు. ఈ రకంగా దేశంలో అంతర్గత శతృవులపై మేజర్ అజయ్ కృష్ణ చేసే పోరాటమే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.
మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటోస్)
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.16.5 కోట్లకు అమ్ముడుపోయింది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు మరోసారి హాట్రిక్ హిట్ నమోదు చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.