మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నుంచి మరో పాట వచ్చేసింది. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా వీడియో సాంగ్ ప్రోమో ఇచ్చేసాడు సూపర్ స్టార్. అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తమన్నా సాంగ్ విడుదల చేసారు..
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నుంచి మరో పాట వచ్చేసింది. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా వీడియో సాంగ్ ప్రోమో ఇచ్చేసాడు సూపర్ స్టార్. అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తమన్నా సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. డ్యాంగ్ డ్యాంగ్ అంటూ మరోసారి అందాల జడివానలో అందర్నీ ముంచేసింది మిల్కీ బ్యూటీ. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఐటం సాంగ్ స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. తమన్నా అయితే తన నడుము అందాలతో పిచ్చెక్కించింది. ఈ పాట మిలటరీ నేపథ్యంలో సాగుతుంది. అక్కడే కాస్త పార్టీ మూడ్‌లో ఉన్న సైనికుల మధ్య సాగే పాట ఇది. అందుకే అంతా అదే గెటప్స్‌లో కనిపించారు.
ఇక తమన్నా కూడా అలాగే మారిపోయింది. మహేష్ బాబు కూడా ఈ పాటలో డాన్సులు కూడా వేసాడు. ఇప్పటి వరకు విడుదలైన పాటల్లో డాన్సులెక్కడ వేయలేదు ఈయన. బ్యాంగ్ బ్యాంగ్ అంటూ 2020కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు తమన్నా, మహేష్ బాబు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.