SARILERU NEEKEVVARU MOVIE RAMANA LOAD ETHALI RA DIALOGUE ACTOR KUMANAN SETHURAMAN DETAILS PK
రమణా.. లోడ్ ఎత్తాలిరా.. డైలాగ్ చెప్పిన ముసలాయన ఎవరో తెలుసా..?
రమణ లోడ్ ఎత్తాలిరా ఫేమ్ కుమనన్ సేతురామన్
రమణ లోడ్ ఎత్తాలిరా.. ఈ డైలాగ్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో ఇప్పుడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి రాసిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు ధారాళంలా వ్యాపించింది. ఒక్క డైలాగుతోనే ఇంత ఫేమస్ అవ్వొచ్చా..
రమణ లోడ్ ఎత్తాలిరా.. ఈ డైలాగ్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో ఇప్పుడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి రాసిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు ధారాళంలా వ్యాపించింది. ఒక్క డైలాగుతోనే ఇంత ఫేమస్ అవ్వొచ్చా అనేలా పేలిపోయింది ఈ రమణ లోడ్ ఎత్తాలిరా మాట. ఇక ఈ సినిమాలో ఈ ఒక్క డైలాగుతోనే తన స్థాయిని పెంచేసుకున్నాడు ఓ ముసలాయన. అసలు అంతకుముందు ఎప్పుడూ వెండితెరపై చూసినట్లు కూడా ఉండని మొహం అది.. కానీ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసాడు.. కానీ అందులో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తింపు తెచ్చిన పాత్ర లేదు. సైరాలో నిహారిక తండ్రిగా నటించింది కూడా ఈయనే.
రమణ లోడ్ ఎత్తాలిరా ఫేమ్ కుమనన్ సేతురామన్
ఆ ముసలాయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వెతికేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎవరాయనా.. ఎక్కడ్నుంచి వచ్చాడంటూ.. ఆయన అసలు పేరు కుమనన్ సేతురామన్.. సొంత రాష్ట్రం తమిళనాడు. అయితే 1984లోనే వైజాగ్‌లో సెటిల్ అయిపోయాడు కుమనన్. ఆయన భార్య పేరు మహాలక్ష్మి. స్వతహాగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన కుమనన్.. సినిమాలపై మోజుపై హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ చాలా ఏళ్ల పాటు ట్రై చేసాడు కానీ అదృష్టం కలిసిరాలేదు. అల్లుడు శీనులో బాబాగా వచ్చేది కూడా ఈయనే.. ఆ తర్వాత సైరాలో నిహారిక తండ్రిగా నటించాడు.
రమణ లోడ్ ఎత్తాలిరా ఫేమ్ కుమనన్ సేతురామన్
దాంతో పాటే పదుల సంఖ్యలో సినిమాలు చేసాడు కానీ ఒక్కటి కూడా కోరుకున్న గుర్తింపు అయితే తీసుకురాలేదు. అలాంటి సమయంలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రంలో 5 నిమిషాల పాటు కనిపించే పాత్రలో నటించాడు కుమనన్. రమణా లోడ్ ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్ పడతాది అంటూ వెరైటీగా ఈయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. దానికితోడు చూడ్డానికి కూడా ఫిజిక్ అద్భుతంగా ఉండటంతో ఎవరీ ముసలాయనా అంటూ అంతా ఆయన గురించి వెతకడం మొదలుపెట్టారు.
రమణ లోడ్ ఎత్తాలిరా ఫేమ్ కుమనన్ సేతురామన్
అప్పుడు తెలిసింది ఈయన సీనియర్ యాక్టర్ అని.. పేరు కుమనన్ అని.. కానీ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం చూస్తున్నాడని. అలాంటి వాడికి అనిల్ రావిపూడి బ్రేక్ ఇచ్చాడు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు.. ఫోటోగ్రఫర్ కూడా. తన ప్యాషన్ కొడుకు హేమంత్‌కు అలవాటు చేసాడు. ప్రస్తుతం ఈయన తనయుడు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ ఫోటోగ్రఫర్ కూడా. మొత్తానికి ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం అంటే ఇదే మరి. ఇన్నేళ్లుగా రాని ఫేమ్.. నేమ్.. ఒక్క డైలాగ్‌తో సంపాదించుకున్నాడు కుమనన్ సేతురామన్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.