SARILERU NEEKEVVARU MOVIE LATEST COLLECTIONS AND MAHESH BABU GRAND ENTRY INTO 200 CRORE CLUB PK
సరిలేరు నీకెవ్వరు లేటెస్ట్ కలెక్షన్స్.. 200 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. ఈ చిత్రం 10 రోజుల్లోనే సంచలన వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. ఈ చిత్రం 10 రోజుల్లోనే సంచలన వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు ఇప్పటి వరకు 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 115 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 100 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది. మహేష్ బాబు కెరీర్లో తొలి 200 కోట్ల సినిమా కావడం విశేషం.
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Twitter/Photos)
రెండు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. ఇప్పటి వరకు నైజాంలో 33 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు సూపర్ స్టార్. ఇక సీడెడ్లో 14.65 కోట్లు.. తూర్పు గోదావరి 10.06 కోట్లు.. పశ్చిమ గోదావరి 6.57 కోట్లు.. గుంటూరు 9.03 కోట్లు.. కృష్ణా 7.97 కోట్లు.. నెల్లూరు 3.62 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 10.25 కోట్లు.. నార్త్ అమెరికా 8.8 కోట్లు.. గల్ఫ్ 1.25 కోట్లు.. ఆస్ట్రేలియా 0.9 కోట్లు.. సింగపూర్ 0.4 కోట్లు.. లండన్ 0.35 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 0.56 కోట్లు వసూలు చేసింది. ఇదంతా కలిపి 200 కోట్లకు పైగా గ్రాస్.. 120 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నిజంగానే సంక్రాంతి మొగుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.