చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నా టార్గెట్ అంటున్న అనిల్ రావిపూడి..

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాజమౌళి, కొరటాల తర్వాత పరాజయం అంటూ లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2020, 11:06 PM IST
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నా టార్గెట్ అంటున్న అనిల్ రావిపూడి..
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi Jr NTR Chiranjeevi)
  • Share this:
అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాజమౌళి, కొరటాల తర్వాత పరాజయం అంటూ లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పటి వరకు చేసిన ఐదు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధించింది. రొటీన్ కమర్షియల్ సినిమా అంటూనే ఈ చిత్రం ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈయన ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా మనసులో మాట బయటపెట్టాడు అనిల్.

I will write the stories for Chiranjeevi and Jr NTR says Sarileru Neekevvaru director Anil Ravipudi pk అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాజమౌళి, కొరటాల తర్వాత పరాజయం అంటూ లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలు.. anil ravipudi,anil ravipudi twitter,anil ravipudi mahesh babu,anil ravipudi sarileru neekevvaru,anil ravipudi movies,anil ravipudi chiranjeevi,anil ravipudi jr ntr,telugu cinema,అనిల్ రావిపూడి,అనిల్ రావిపూడి చిరంజీవి,అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్,అనిల్ రావిపూడి మహేష్ బాబు,తెలుగు సినిమా
దర్శకుడు అనిల్ రావిపూడి

ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ అనిల్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం అని చెప్పాడు. ఇక ఆయన కానీ కథ సిద్ధం చేయమంటే కేవలం 3 నెలల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేస్తానంటున్నాడు ఈయన. పైగా చిరు కూడా అనిల్ టేకింగ్‌కు ఫిదా అయిపోయాడు. కచ్చితంగా సరైన కథ తీసుకొస్తే మెగా కంపౌండ్‌లోకి అడుగు పెట్టడం ఖాయం. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా సినిమా చేస్తానంటున్నాడు ఈయన. ప్రస్తుతం అనిల్ రావిపూడి జోరు చూస్తుంటే ఈ కల నెరవేరడానికి కూడా పెద్దగా సమయం తీసుకునేలా కనిపించడం లేదు.

I will write the stories for Chiranjeevi and Jr NTR says Sarileru Neekevvaru director Anil Ravipudi pk అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాజమౌళి, కొరటాల తర్వాత పరాజయం అంటూ లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలు.. anil ravipudi,anil ravipudi twitter,anil ravipudi mahesh babu,anil ravipudi sarileru neekevvaru,anil ravipudi movies,anil ravipudi chiranjeevi,anil ravipudi jr ntr,telugu cinema,అనిల్ రావిపూడి,అనిల్ రావిపూడి చిరంజీవి,అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్,అనిల్ రావిపూడి మహేష్ బాబు,తెలుగు సినిమా
దర్శకుడు అనిల్ రావిపూడి
అనిల్ కథ చెబితే కాదనే హీరోలు కూడా ఇప్పుడు లేరు. ఎందుకంటే రొటీన్ కథలను కూడా కమర్షియలైజ్ చేసి తెరకెక్కించి విజయం సాధిస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. త్వరలోనే తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తానంటున్నాడు ఈయన. ఏదేమైనా కూడా సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈయన రేంజ్ పెరిగిపోయింది. కానీ విచిత్రంగా స్టార్ హీరోలే ఎవరూ ఈయన్ని తలుచుకోవడం లేదంతే.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు