Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: January 16, 2020, 12:17 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’ 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. పాజిటివ్ టాక్తో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ.46.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండోరోజు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైనా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళు చేసిన ఈ సినిమా భోగి రోజు కూడా అది హవా కంటిన్యూ చేసింది. ఇక సంక్రాంతి రోజున ఈ సినిమా అన్ని ఏరియాల్లో దుమ్ము దులిపింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదో రోజు రూ. 13 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పండగ కలిసిరావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పంట పండింది.

‘సరిలేరు నీకెవ్వరు’ 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)
ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, రష్మిక గ్లామర్, విజయశాంతి రీ ఎంట్రీ వెరసి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ. టోటల్గా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు సంక్రాంతి మొగుడుగా సత్తా చూపెడుతున్నాడు. మొత్తానికి ఈ ఆదివారం వరకు సరిలేరు నీకెవ్వరు సత్తా చూపెట్టే అవకాశం ఉంది. సోమవారం సెలవులు అయిపోతాయి కాబట్టి అపుడు ఏ మేరకు సత్తా చూపెడుతుందో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 16, 2020, 12:17 PM IST