గతేడాది ‘మహర్షి’ సినిమాతో బాక్సాఫీస్‌ను పలకరించిన మహేష్ బాబు.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పలకరించాడు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే
ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పలకరించాడు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ.46.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండోరోజు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైనా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. రెండోరోజు కూడా ఈ చిత్రం దూకుడు సాగింది. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపేసింది.మొత్తంగా మూడో రోజు రూ. 100 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన ఈ చిత్రం నాల్గో రోజు కూడా అదే దూకుడు చూపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, రష్మిక గ్లామర్, విజయశాంతి రీ ఎంట్రీ వెరసి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతుంది. ఈ రోజు ఆర్మీ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
తొలిరోజు కంటే 40 శాతం థియేటర్స్ తక్కువగా ఉండటంతో కలెక్షన్స్ కూడా కాస్త తగ్గాయి. అయితే సెకండ్ డే మాత్రం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా షేర్.. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. బన్నీ సినిమా వచ్చినా కూడా మహేష్ బాబు మాత్రం దూకుడు తగ్గించలేదు. పండగ సెలవులు ఇంకా ఉండటంతో ఇప్పట్నుంచి అసలు రచ్చ షురూ కానుంది. బి, సీ సెంటర్స్‌లో సరిలేరు నీకెవ్వరు దూసుకుపోతుంది. మూడో రోజు కూడా ఈ సినిమా రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. నాల్గో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 నుంచి రూ. 12 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నాల్గు రోజుల్లో సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా రూ. 120 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టోటల్‌గా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు మేనియా కనిపిస్తోంది. మొత్తంగా రూ. 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం సేఫ్ జోన్లోకి రావాలంటే మరో రూ. 22 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతోంది. చూడాలిక పండగ తర్వాత ఈ సినిమా ఏ మేరకు సత్తా చూపెడుతుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.