Home /News /movies /

SARILERU NEEKEVVARU MOVIE 30 DAYS WORLDWIDE COLLECTIONS AND MAHESH BABU SCORED BIG HIT PK

సరిలేరు నీకెవ్వరు 30 డేస్ కలెక్షన్స్.. మహేష్ గట్టిగానే కొట్టాడు..

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)

Sarileru Neekevvaru: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం విడుదలై అప్పుడే నెల రోజులు దాటేసింది. ఈ నెల రోజుల్లో 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం విడుదలై అప్పుడే నెల రోజులు దాటేసింది. ఈ నెల రోజుల్లో 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు రెండు వారాల్లో దాదాపు 121 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడు, నాలుగు వారాల్లో మరో 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 110 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది.
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)

నెల రోజులు పూర్తి కావడంతో అన్నిచోట్లా కూడా ఫైనల్ రన్‌కు దగ్గరికి వచ్చేసింది సరిలేరు నీకెవ్వరు. రెండు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చూపించింది. అయితే మూడో వారం నుంచి పడిపోయింది ఈ చిత్రం. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మంచి పోటీ ఇవ్వడంతో మహేష్ జోరు తగ్గించక తప్పలేదు. ఇప్పటి వరకు నైజాంలో 39 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు సూపర్ స్టార్. ఇక సీడెడ్‌లో 15.55 కోట్లు.. తూర్పు గోదావరి 10.06 కోట్లు.. ఉత్తరాంధ్ర 19.20 కోట్లు.. వెస్ట్ గోదావరి 7.57 కోట్లు.. గుంటూరు 9.87 కోట్లు.. కృష్ణా 8.82 కోట్లు.. నెల్లూరు 4.02 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 10.02 కోట్లు.. నార్త్ అమెరికా 8.8 కోట్లు.. గల్ఫ్ 1.25 కోట్లు.. ఆస్ట్రేలియా 0.9 కోట్లు.. సింగపూర్ 0.4 కోట్లు.. లండన్‌ 0.35 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌ 0.56 కోట్లు వసూలు చేసింది. ఇదంతా కలిపి 200 కోట్లకు పైగా గ్రాస్.. 130 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నిజంగానే సంక్రాంతి మొగుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు