‘సరిలేరు నీకెవ్వరు’ 3 డేస్ కలెక్షన్స్.. రూ.100 కోట్ల క్లబ్బులో మహేష్ బాబు మరో సినిమా..

గతేడాది ‘మహర్షి’ సినిమాతో బాక్సాఫీస్‌ను పలకరించిన మహేష్ బాబు.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పలకరించాడు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 15, 2020, 5:56 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’ 3 డేస్ కలెక్షన్స్.. రూ.100 కోట్ల క్లబ్బులో మహేష్ బాబు మరో సినిమా..
రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ (Twitter/Photo)
  • Share this:
గతేడాది ‘మహర్షి’ సినిమాతో బాక్సాఫీస్‌ను పలకరించిన మహేష్ బాబు.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పలకరించాడు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం  తొలి రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ.46.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండోరోజు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైనా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.  రెండోరోజు కూడా ఈ చిత్రం దూకుడు సాగింది. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపేసింది.

Sarileru Neekevvaru movie 3 days Worldwide collections and entered into 100 crore club Mahesh Babu still continue at box office,Sarileru Neekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు
బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు ఊచకోత (Twitter/Photo)


తొలిరోజు కంటే 40 శాతం థియేటర్స్ తక్కువగా ఉండటంతో కలెక్షన్స్ కూడా కాస్త తగ్గాయి. అయితే సెకండ్ డే మాత్రం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా షేర్.. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. బన్నీ సినిమా వచ్చినా కూడా మహేష్ బాబు మాత్రం దూకుడు తగ్గించలేదు. పండగ సెలవులు ఇంకా ఉండటంతో ఇప్పట్నుంచి అసలు రచ్చ షురూ కానుంది. బి, సీ సెంటర్స్‌లో సరిలేరు నీకెవ్వరు దూసుకుపోతుంది. మూడో రోజు కూడా ఈ సినిమా రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా షేర్.. రూ.103 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రూ.102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సరిలేరు నీకెవ్వరు. మూ రోజుల్లోనే ఈ చిత్రం రూ.70 కోట్ల షేర్ వసూలు చేసింది.. మరో వారం రోజుల్లో 30 కోట్ల మార్క్ అందుకుంటే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సేఫ్ జోన్‌లోకి వస్తోంది.
First published: January 14, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading