Home /News /movies /

SARILERU NEEKEVVARU MOVIE 23 DAYS COLLECTIONS AND MAHESH BABU SCORED A SUPER HIT PK

సరిలేరు నీకెవ్వరు ఇక్కడ బ్లాక్‌బస్టర్.. అక్కడ మాత్రం ఫ్లాప్..

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 30 days worldwide collections)

Sarileru Neekevvaru: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం 23 రోజుల్లోనే 127 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం 23 రోజుల్లోనే 127 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మూడు వారాల్లో దాదాపు 127 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడో వారంలో ఈ చిత్రం 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 107 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2, అల వైకుంఠపురములో, బాహుబలి తర్వాత నాలుగో స్థానంలో సరిలేరు నీకెవ్వరు నిలిచింది.
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)

చిరంజీవి సైరా ఐదో స్థానానికి పడిపోయింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది. నాలుగో వారంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కాస్త జోరు తగ్గించింది సరిలేరు నీకెవ్వరు.మూడు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. ఇప్పటి వరకు నైజాంలో 34 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు సూపర్ స్టార్.
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)

ఇక సీడెడ్‌లో 15.65 కోట్లు.. తూర్పు గోదావరి 11.06 కోట్లు.. పశ్చిమ గోదావరి 8.57 కోట్లు.. గుంటూరు 10 కోట్లు.. కృష్ణా 9.97 కోట్లు.. నెల్లూరు 5.62 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 11.25 కోట్లు.. నార్త్ అమెరికా 9.3 కోట్లు.. గల్ఫ్ 1.25 కోట్లు.. ఆస్ట్రేలియా 0.9 కోట్లు.. సింగపూర్ 0.4 కోట్లు.. లండన్‌ 0.35 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌ 0.56 కోట్లు వసూలు చేసింది. ఇదంతా కలిపి 200 కోట్లకు పైగా గ్రాస్.. 127 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నిజంగానే సంక్రాంతి మొగుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)

ఈ సినిమాతో భరత్ అనే నేను, మహర్షి తర్వాత హ్యాట్రిక్ పూర్తి చేసాడు మహేష్. అయితే ఇండియాలో బ్లాక్‌బస్టర్ అయినా కూడా ఓవర్సీస్‌లో మాత్రం సరిలేరు నీకెవ్వరు కోటిన్నర వరకు నష్టాలు తీసుకొచ్చిందని తెలుస్తుంది. 2 మిలియన్ దాటేసినా కూడా చేసిన బిజినెస్ భారీగా ఉండటం.. అల వైకుంఠపురములో ధాటికి నష్టాలు తప్పలేదు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు