Home /News /movies /

SARILERU NEEKEVVARU HEROINE RASHMIKA MANDANNA COMMENTS ON MAHESH DANCE SKILLS SR

ఆ విషయంలో మహేష్‌‌ను అందుకోగలనా... అందోళనలో రష్మిక

Instagram/rashmika_mandanna

Instagram/rashmika_mandanna

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ వస్తోన్న విషయం తెలిసిందే.

    మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు  ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదలౌతోంది. మహేష్ బాబు సరసన రష్మిక మందన మొదటిసారిగా నటిస్తోంది. రష్మిక విషయంలో అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇందులో రష్మిక మందన్న, మహేష్ జోడీగా ఎలా కనిపిస్తుందో ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు రష్మిక సైతం మహేష్ పక్కన నటిస్తుండటం మొదటిసారి కావడంతో కొంత ఎగ్జైట్ అవుతోంది. దీనికితోడు ఈ సినిమాలో మహేష్ బాబుతో డాన్స్‌  ఉండడంతో ఆ డ్యాన్సుల విషయంలో తాను సరితూగగలనో లేదో తెలీడం లేదని, అందుకే తన వంతుగా రిహార్సల్స్ మీద ఎక్కువ దృష్టిపెట్టానని చెబుతోంది రష్మిక. దిల్ రాజు, అనిల్ సుంకర కలయికలో నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్ సమపాళ్ళలో ఉన్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

    నడుము ఒంపులతో కవ్విస్తోన్న నిక్కీ గల్రానీ...
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rashmika mandanna, Sarileru Neekevvaru, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు