హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Pradeep: ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్‌లు అడిగినా చెప్ప‌లే.. నీకు చెప్తున్నా.. ప్ర‌దీప్ కోసం త‌మిళ సింగ‌ర్ స్టోరీ

Anchor Pradeep: ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్‌లు అడిగినా చెప్ప‌లే.. నీకు చెప్తున్నా.. ప్ర‌దీప్ కోసం త‌మిళ సింగ‌ర్ స్టోరీ

 బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ న‌టుడు ఇప్పుడు హీరోగా కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు

ఇంకా చదవండి ...

    Anchor Pradeep: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ న‌టుడు ఇప్పుడు హీరోగా కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. మున్నా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌దీప్ న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్ప‌టికే ఒక సినిమాలో హీరోగా చేసిన ప్ర‌దీప్ కోసం ఓ త‌మిళ సింగ‌ర్ క‌థ‌ను రెడీ చేసింది. జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే స‌రిగ‌మ‌ప నెక్ట్స్ సింగింగ్ ఐకాన్‌కి ప్ర‌దీప్ వ్యాఖ్యత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే.

    ఈ సింగింగ్ షోలో త‌మిళ‌నాడుకు చెందిన అన‌న్య భాస్క‌ర్ అనే సింగ‌ర్ ఒక కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది. మొద‌టి నుంచి త‌న పాట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ వ‌స్తోన్న అన‌న్య‌.. ఇప్పుడు టాప్ 6లోకి చేరింది. ఇక ఈ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుద‌ల అయ్యింది.

    అందులో అన‌న్య, ప్ర‌దీప్‌కి ఒక స్టోరీ చెప్పింది. ఈ స్టోరీ ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్‌లు అడిగినా ఇవ్వ‌లేద‌ని.. నీ కోస‌మే చెప్తున్నానని అన‌న్య అంటుంది. అందులో యాక్ష‌న్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్లు అన్ని అన‌న్య చెబుతుంది. ఆ స్టోరీ ప్ర‌దీప్‌ని కూడా బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏం పెడ‌దాము అని అడ‌గ్గా.. చెప్పులు కుట్టే చిన్న‌య్య అని ఎస్పీ శైల‌జ అంటుంది. ఇక కోఠి లేటెస్ట్ టైటిల్ ఫ‌స‌క్ అని చెబుతాడు. దానికి శైల‌జ అది క్యాప్ష‌న్‌గా పెడ‌దామంటుంది. మొత్తానికి అన‌న్య, ప్ర‌దీప్‌కి చెప్పిన స్టోరీ సెట్‌లో అంద‌రి చేత న‌వ్వులు పూయిస్తుంది.

    First published:

    Tags: Anchor pradeep