• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SARIGAMAPA NEXT SINGING ICON PROMO ANCHOR PRADEEP HELPS LOT OF PEOPLE DURING LOCKDOWN MNJ

Anchor Pradeep: ప్ర‌దీప్ సోనూసూద్ అంత‌టి వాడ‌ట‌.. ఇంత‌కు ఈ యాంక‌ర్ ఏం చేశాడంటే..!

Anchor Pradeep: ప్ర‌దీప్ సోనూసూద్ అంత‌టి వాడ‌ట‌.. ఇంత‌కు ఈ యాంక‌ర్ ఏం చేశాడంటే..!

యాంకర్ ప్రదీప్ సోనూసూద్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్(Pradeep Machiraju) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ(Suma Kaakala) త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ప్ర‌దీప్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

  • Share this:
    Anchor Pradeep: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ప్ర‌దీప్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ మూవీ క‌చ్చితంగా విజ‌యం అవుతుంద‌న్న ధీమాలో ప్ర‌దీప్ ఉండ‌గా.. అటు ఆయ‌న అభిమానులు కూడా ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే బుల్లితెర‌పై ప్ర‌దీప్ వ్యాఖ్య‌త‌గా చేసే షోల‌లో జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే స‌రిగ‌మ‌ప- నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ ఒక‌టి. ఇందులో కోఠి, ఎస్పీ శైల‌జ‌, చంద్ర‌బోస్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

    కాగా ప్ర‌తి ఆదివారం ప్ర‌ద‌ర్శితం అవుతున్న ఈ సింగింగ్ షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమోను విడుద‌ల చేశారు. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే కంటెస్టెంట్ ఇంజ‌నీరింగ్ పూర్తి అయ్యే వ‌ర‌కు కాలేజ్ ఫీజులు తాను భరిస్తాన‌ని ప్ర‌దీప్ చెప్పారు. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్, అత‌డి తండ్రి భావోద్వేగానికి గుర‌య్యారు. అయితే ప్ర‌దీప్ ఇలాంటి సహాయాలు చేయ‌డం కొత్తేం కాద‌ని, లాక్‌డౌన్‌లో చాలా మందికి సాయం చేశాడ‌ని సింగ‌ర్ సాంకేత్ అంటాడు. ఈ క్ర‌మంలో స్టేజ్ మీద‌కు వ‌చ్చిన ఓ టీమ్.. ప్ర‌దీప్ గురించి ప్ర‌శంస‌లు కురిపించారు.

    ప్ర‌దీప్ చెట్టులాంటి వాడ‌ని.. చెట్టుకు ఇవ్వ‌డ‌మే తెలుసు, తీసుకోవ‌డం తెలీద‌ని ఓ వ్య‌క్తి తెలిపారు. సినిమాల్లో సోనూ సూద్ అయితే టెలివిజ‌న్‌లో మాకు ప్ర‌దీప్ అని వారు చెప్పారు. దీంతో ప్ర‌దీప్ కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సెల‌బ్రిటీలు వారిని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. త‌మ‌కు తోచిన సాయం చేసి కొంత‌మందిని ఆదుకున్నారు. ఈ లిస్ట్‌లో సోనూసూద్, ప్ర‌కాష్ రాజ్‌, క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ప్ర‌ణీత, యాంక‌ర్ ర‌ష్మి, యాంక‌ర్ ప్ర‌దీప్ త‌దిత‌రులు ఉన్నారు.
    Published by:Manjula S
    First published: