Bigg Boss 5 Telugu Sarayu - Lahari: రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటి తో ప్రారంభమై వారం రోజులు పూర్తయింది. ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చి తమ గేమ్ లో కూడా బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ షో మొదటి రోజు నుండే హైలెట్ గా అనిపించింది. అంతేకాకుండా మొదటి రెండు మూడు రోజుల్లోనే పరిచయాలు పెంచుకోవడం, గొడవలకి దిగడం, మళ్లీ వెంటనే కలుసుకుపోవడం వంటివి బాగానే జరిగాయి. ఇక ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో సరయు మరో కంటెస్టెంట్ లహరికి ఓ రేంజ్ లో ఇచ్చి పడేసింది.
షో ప్రారంభమైన రెండవ రోజే ఎలిమినేషన్ రౌండ్ ఉండగా అందులో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ లిస్టులో చేరారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను ఇంటికి పంపించడం జరిగింది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంటే బోల్డ్ బ్యూటీ సరయు. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియా పరిచయమున్న వాళ్లకి బాగా తెలుసు. తన బూతు మాటలతో హైలెట్ గా నిలిచి బిగ్ బాస్ షో లోనే అవకాశాన్ని అందుకుంది.
ఇది కూడా చదవండి:నీకు వంట చెయ్యడం రాదా.. ఆర్జే కాజల్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. దొరికిపోయా అంటూ?
ఇక ఈమె బిగ్ బాస్ వేదికపై నాగార్జున ముందు ఎంట్రీ ఇచ్చింది. అందులో ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్ ను ఇవ్వగా అందులో మొత్తానికి బెస్ట్, వరెస్ట్ ప్లేస్ లో కొందరి కంటెస్టెంట్ లను పెట్టి వారి గురించి తన మనసులో మాటలను బయటపెట్టింది. ఇక తనకు బెస్ట్ గా అనిపించినా కంటెస్టెంట్ ల గురించి ఎంత పొగిడిందో.. తనకు వరెస్ట్ గా కనిపించిన కంటెస్టెంట్ ల గురించి అంతగా మండిపడింది. వారిపై బాగానే ఫైర్ అయ్యింది. ఇక మరో కంటెస్టెంట్ లహరిని వరెస్ట్ ప్లేస్ లో పెట్టి అందరి ముందే గట్టిగా ఇచ్చి పడేసింది.
ఇది కూడా చదవండి: అనవసరంగా ఆమెతో గొడవ పెట్టుకున్న.. నాగార్జున పేరు వాడుతూ అలా నోరు జారిన జెస్సీ
లహరి గురించి మాట్లాడుతూ.. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్లను తక్కువ చేయాల్సిన పనిలేదు అంటూ నీకు అంత ఈగో ఏంటి.. ఏం లేని ఆకు ఎగిసి పడుతుంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా అందరితో మాట్లాడే తీరు మార్చుకో.. నువ్వు అంత అని ఫీల్ అయితే.. నేను నీ కంటే ఎత్తులో ఉంటాను అంటూ నువ్వు ఎదగాలి అని అందర్నీ తొక్కేయకు అంటూ ఓ రేంజ్ లో బదులిచ్చింది సరయు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg Boss 5 Telugu, Lahari, Sarayu, Star Maa