Home /News /movies /

SARANGA DARIYA SONG FROM LOVE STORY CREAYES A NEW RECORED NEW TOLLYWOOD MHN

Sai Pallavi - Saranga Dariya Song: ‘సారంగ దరియా’ సరికొత్త రికార్డ్.. మరోసారి తన మార్క్ క్రియేట్ చేసిన సాయిపల్లవి

Saranga Dariya song from Love Story creayes a new recored new tollywood

Saranga Dariya song from Love Story creayes a new recored new tollywood

Sai Pallavi - Saranga Dariya Song: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’ సినిమా నుంచి విడుదలైన ‘సారంగ దరియా..’ సాంగ్ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది

    సౌత్ హీరోయిన్లలో సాయిపల్లవి స్టయిలే వేరన్న విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తనను ఎవరైనా ఫలానా సినిమాల్లో నటించాలని సంప్రదిస్తే కథ, పాత్ర నచ్చితేనే చేస్తానని లేకుంటే ఎలాంటి గ్లామర్ పాత్రకు అయినా.. స్టార్ హీరోల సరసనైనా సరే మొహమాటం లేకుండా చేయనని చెప్పేస్తుంటుంది. ఇలా చాలా సినిమాలే ఈ బ్యూటీ మిస్ చేసుకుంది. అయితే.. వన్స్ ఈ భామ సినిమా ఒప్పుకుంటే మాత్రం ఇక టీజర్, ట్రైలర్, సాంగ్.. ఫైనల్‌గా సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యి, దుమ్మురేగిపోవాల్సిందే. ఎందుకంటే ఆ బ్యూటీకి ఉండే యూత్‌లో ఉండే క్రేజ్.. న్యాచురాలిటీ అలాంటిది మరి. ఇలా ఇప్పటికే తనదైన మార్క్‌ను సాయిపల్లవి క్రియేట్ చేసి చూపించింది.

    తమిళ హీరో ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి-2’ మూవీ ఎలాంటి హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘రౌడీ బేబీ’ సాంగ్ అప్పటికీ.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉందంటే అది కేవలం సాయిపల్లవి క్రేజ్, యాక్టింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు.. వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే..’ అనే పాట కూడా ట్రెండ్ సెట్ చేసింది. ఎందుకంటే ఆమె బ్యూటీ, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇలా ఈ రెండు సాంగ్స్‌ను అప్పటికీ.. ఇప్పుటికీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

    ఈ రెండు పాటల తర్వాత.. ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా’ సాంగ్‌ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 14 రోజుల్లోనే ఈ పాటకు 50,992,242 (50 మిలియన్ వ్యూస్) వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్స్ గురించి చెప్పాలంటే.. అటు పాట రాసిన, పాడిన.. ఇటు సాయిపల్లవిని అభిమానులు, సినీ ప్రియులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా.. తెలుగు సినిమా పాటకు ఇంత ఆదరణ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో మొత్తం క్రెడిట్ సాయిపల్లవికే దక్కాల్సిందే. నిజంగా.. 2017లో ‘వచ్చిండే’ సాంగ్, 2018లో ‘ఏవండోయ్ నానిగారు’ సాంగ్, 2019లో ‘రౌడీ బేబీ’ సాంగ్.. ఇప్పుడు 2021లో ‘సారంగ దరియా’ అంటూ ఈ అన్ని పాటల్లో సాయి పల్లవి దుమ్ములేపేసిందనే చెప్పుకోక తప్పదు మరి.

    అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరి’. ఏప్రిల్‌16న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఇక శేఖర్ కమ్ముల చెక్కే సినిమా ఏ రేంజ్‌‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. మొత్తానికి చూస్తే.. పాట ఏదైనా సరే తన బ్యూటీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో తన మార్క్‌ను తానే క్రియేట్ చేస్తూ.. అటు వ్యూస్‌తో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేస్తోందన్న విషయం ‘సారంగ దరియా’తో స్పష్టంగా అర్థమైంది.
    Published by:Anil
    First published:

    Tags: Love Story Movie, Sai Pallavi

    తదుపరి వార్తలు