• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SARANGA DARIYA SINGER KOMALA MET SEKHAR KAMMULA KEPT FULL STOP TO SONG CONTROVERSY MNJ

Saranga Dariya Controversy: ముగిసిన సారంగదరియా వివాదం.. శేఖ‌ర్ క‌మ్ముల‌ను క‌లిసిన కోమ‌ల ఏమ‌న్నారంటే

శేఖర్ కమ్ముల కోమల

Saranga Dariya Controversy- Komala: నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీలోని సారంగ ద‌రియా పాట తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోన్న విష‌యం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ మూమెంట్స్‌కు తోడు మంగ్లీ గాత్రంతో వ‌చ్చిన ఈ పాట‌కు ఇప్ప‌టికే 57మిలియ‌న్ల వ్యూస్ దాటిపోయాయి

  • Share this:
    Saranga Dariya Controversy- Komala: నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీలోని సారంగ ద‌రియా పాట తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోన్న విష‌యం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ మూమెంట్స్‌కు తోడు మంగ్లీ గాత్రంతో వ‌చ్చిన ఈ పాట‌కు ఇప్ప‌టికే 57మిలియ‌న్ల వ్యూస్ దాటిపోయాయి. తెలుగు వారే కాదు తమిళ్, కన్నడ, మలయాళం వారు కూడా ఈ పాట‌కు స్టెప్పులు వేస్తున్నారు. అయితే ఈ పాట విడుద‌లైన కొన్ని రోజుల‌కే వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ రాయ‌గా.. సారంగ దరియా పాటపై సర్వ హక్కులూ తనకే ఉన్నాయని జానపద గాయని కోమలి వాదించింది. అసలు ఈ పాటను వెలుగులోకి తెచ్చింది తానేనని కోమ‌లి ప‌లు ఇంట‌ర్వ్యూల్లో తెలిపారు. ఎంతో కష్టపడి ఆ పాటను సేకరించాన‌ని.. చిన్నతనంలో తన అమ్మమ్మ పాడుతుండగా విని రాసుకున్నానని కోమ‌లి తెలిపింది. తన వల్లే ఈ ప్రపంచానికి సారంగ దరియా పాట గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే రేలరే రేలా ప్రోగ్రాంలో జడ్జిగా ఉన్న సుద్దాల అశోక్ తేజ.. ఈ పాటను విని ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాకు వాడుకున్నారని ఆమె వాపోయింది.

    అంతేకాకుండా లవ్ స్టోరీ సినిమాలో తనతో పాడించనందుకు ఎంతో బాధేసిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మ‌రోవైపు సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఈ పాట‌పై హ‌క్కులు కోమ‌లికి ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇక మ‌రోవైపు ఇటీవ‌ల ల‌వ్ స్టోరీ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఈ వివాదం గురించి త‌న ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ పాట‌ను పాడేందుకు కోమ‌ల‌ను ర‌మ్మ‌ని పిలిచామ‌ని.. అయితే జ‌లుబు ఉంది రాలేన‌ని ఆమె చెప్పిందని ఆయ‌న అన్నారు. అయిత త‌న‌కు క్రెడిట్ ఇస్తే అభ్యంత‌రం లేద‌ని కోమ‌ల అప్పుడు చెప్పింద‌ని.. ఇక పాట అనౌన్స్ చేశాం కాబ‌ట్టి మంగ్లీతో పాడించామ‌ని శేఖ‌ర్ క‌మ్ముల చెప్పారు. ఇక సుద్దాల కూడా ఈ పాట కోమ‌లిదని చెప్పార‌ని.. ఆమెకు క్రెడిట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.

    ఇదంతా ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు ముగిసిపోయింది. శేఖ‌ర్ క‌మ్ముల‌ను క‌లిసిన కోమ‌ల వివాదం ముగిసిన‌ట్లు చెప్పింది. త‌న త‌దుప‌రి సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని క‌మ్ముల అన్నార‌ని, అలాగే కుదిరితే ఆడియో ఫంక్ష‌న్‌లో పాడిస్తాన‌ని చెప్పార‌ని కోమ‌ల అన్నారు. ఇక శేఖ‌ర్ క‌మ్ముల కూడా మాట్లాడుతూ.. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల ఇదంతా జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. ఇక ఈ వివాదం ముగిసిపోయింద‌ని ఆయ‌న కూడా క్లారిటీని ఇచ్చారు.
    Published by:Manjula S
    First published: