సుధీర్ ముందే రష్మీ పరువు తీసేసిన సత్తిపండు

రష్మీ, సుధీర్(ఫైల్ ఫోటో)

సుధీర్ చేసే ఏ స్కిట్‌లో అయినా దాదాపు రష్మీ ప్రస్తావన ఉంటుంది. కొన్ని స్కిట్స్‌లో రష్మీ ఎంట్రీ... వారి మధ్య లవ్ సీన్స్ వంటివి కూడా ఉంటాయి.

 • Share this:
  జబర్ధస్త్ ద్వారా పాపులర్ అయిన సుధీర్, రష్మీ జోడికి ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుధీర్ చేసే ఏ స్కిట్‌లో అయినా దాదాపు రష్మీ ప్రస్తావన ఉంటుంది. కొన్ని స్కిట్స్‌లో రష్మీ ఎంట్రీ... వారి మధ్య లవ్ సీన్స్ వంటివి కూడా ఉంటాయి. సుధీర్ స్కిట్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి రష్మీ హైలెట్ అవుతుంటుంది. అందుకే రష్మీ, సుధీర్ జోడి పాపులారిటీ చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. అయితే జబర్ధస్త్ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్, రష్మీ జంట స్పూఫ్ చేసిన ఓ స్కిట్‌లో రష్మీ పరువు తీసేశాడు ఓ జబర్ధస్త్ టీమ్ లీడర్ అతడు మరెవరో కాదు చమ్మక్ చంద్ర స్థానంలో టీమ్ లీడర్‌గా మారిన సత్తిపండు.

  లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ క్యారెక్టర్ స్పూఫ్ చేసిన ఆనంద్‌పై పంచ్‌లు వేసిన సత్తిపండు.. ఇండైరెక్ట్‌గా రష్మీని టార్గెట్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ స్కిట్‌లో డైలాగ్స్‌ను బట్టి సుధీర్ రష్మీ కంటే చాలా జూనియర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు సత్తిపండు. రష్మీ నటించిన హోలీ సినిమా వచ్చినప్పుడు నువ్వు గోలీలు ఆడుకుంటున్నావు అంటూ సుధీర్ స్పూఫ్ క్యారెక్టర్‌ను ఉద్దేశించి సత్తిపండు చేసిన కామెంట్స్... ఫన్నీగా ఉన్నాయి.

  అయితే ఈ కామెంట్స్ విన్న వాళ్లు మాత్రం రష్మీ కంటే సుధీర్ అంత చిన్నవాడా అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి తన స్కిట్‌లో సుధీర్, రష్మీ క్రేజ్‌ను వాడుకున్న సత్తిపండు.. ఇండైరెక్ట్‌గా రష్మీ పరువు తీయడం హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Kishore Akkaladevi
  First published: