Home /News /movies /

SARA TENDULKAR WILL ACT IN MAHESH BABU RAJAMOULI NEW MOVIE SB

మహేష్ బాబు సినిమాలో... స్టార్ క్రికెటర్ కూతురు.. నిజమేనా ?

ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్

ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్

లండన్‌లో డాక్టర్ చదివిన ఈ ముద్దుగుమ్మ త్వరలో.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పడంతో .. ఇప్పుడు ఈ అమ్ముడు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది.

    సర్కారు వారి పాట ఆటకు సిద్దమైంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు,రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా కోసం జక్కన్న కసరత్తులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.

    తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అనంతరం కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. అయతే ఇప్పుడు మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ను తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

    ఇక సారా టెండూల్కర్ విషయానికి వస్తే తన తల్లి మాదిరిగానే సారా మెడిసిన్ పూర్తి చేశారు. లండన్‌లో మెడిసిన్‌ చేసింది. మోడలింగ్‌ అంటే ఆసక్తి. ర్యాంప్‌ మీద మెరిసి అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్నప్పటి నుంచీ సినిమాలు బాగా చూసేది. నటనలో శిక్షణ కూడా తీసుకుంది. మోడలింగ్ రంగంలో ఎంతో పట్టు ఉన్నటువంటి సారా ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సారా  అందానికి ఫిదా అయినటువంటి బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనకు సినిమా అవకాశాలు కల్పించడంతో ముందు తన చదువును పూర్తి చేయాలని ఈమె సినిమా అవకాశాలను పక్కన పెట్టారు.

    సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న సారా నిర్ణయానికి తండ్రి సచిన్‌, తల్లి అంజలి మద్దతు ఇచ్చినట్టు బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం తన చదువు పూర్తి కావడంతో సారా టెండూల్కర్ వెండితెర ఎంట్రీకి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం సారా టెండూల్కర్ ను తీసుకోవాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం.మరి సారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా.. బాలీవుడ్ కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, RRR, Sachin Tendulkar, SS Rajamouli

    తదుపరి వార్తలు