సంక్రాంతి 2020 @ 400 కోట్లు.. బాక్సాఫీస్ బద్ధలైపోయిందిగా..

ముందు నుంచి కూడా 2020 సంక్రాంతిపై భారీ అంచనాలే ఉన్నాయి. 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి పండక్కి రాబోతున్నారని తెలిసి చాలా అంచనాలే వేసుకున్నారు ట్రేడ్ పండితులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2020, 6:18 PM IST
సంక్రాంతి 2020 @ 400 కోట్లు.. బాక్సాఫీస్ బద్ధలైపోయిందిగా..
అల్లు అర్జున్ మహేష్ బాబు Instagram
  • Share this:
ముందు నుంచి కూడా 2020 సంక్రాంతిపై భారీ అంచనాలే ఉన్నాయి. 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి పండక్కి రాబోతున్నారని తెలిసి చాలా అంచనాలే వేసుకున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ల లెక్కలకు ఏ మాత్రం తగ్గలేదు ఈ సంక్రాంతి. ఓ వైపు మహేష్ బాబు.. మరోవైపు అల్లు అర్జున్ ఇద్దరికి ఇద్దరూ బాక్సాఫీస్ మొగుళ్లు అని నిరూపించుకున్నారు. తొలిరోజు నుంచే ఎవరికి వాళ్లు రప్ఫాడిస్తూ వచ్చారు. ఇప్పుడు సంక్రాంతి ముగిసిన 10 రోజుల తర్వాత లెక్కలు చూస్తుంటే ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని తెలిసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. బన్నీ, మహేష్ ఇద్దరూ తమ సత్తాకు తగ్గట్లుగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసారు.

Sankranti movies creating wonders at Box Office and Mahesh Babu Allu Arjun collects over 400 crores pk ముందు నుంచి కూడా 2020 సంక్రాంతిపై భారీ అంచనాలే ఉన్నాయి. 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి పండక్కి రాబోతున్నారని తెలిసి చాలా అంచనాలే వేసుకున్నారు ట్రేడ్ పండితులు. sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Sarileru Neekevvaru collections,Mahesh Babu Sarileru Neekevvaru movie,ala vaikuntapurramuloo collections,sankranti 400 crore,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,
మహేష్ బాబు, అల్లు అర్జున్


ఈ పండక్కి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు తొలి వారంలోనే 100 కోట్ల షేర్ వసూలు చేసాయి. దీన్నిబట్టే బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల సందడి ఎంతగా ఉందో అర్థమైపోతుంది. కొన్ని రోజులుగా సరైన సినిమా ఏదీ లేకపోవడం కూడా సంక్రాంతి సినిమాలకు బాగా కలిసొచ్చింది. మాస్ ఆడియన్స్ అంతా సరిలేరు నీకెవ్వరు అంటే.. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అల వైకుంఠపురములో సినిమాకు ఓటేసారు. ఓవర్సీస్‌లో అయితే ఏకంగా 3 మిలియన్ మార్క్ అందుకుంది అల్లు అర్జున్ అల వైకుంఠపురములో. మరోవైపు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా అక్కడ 2 మిలియన్ దాటేసింది. ఈ రెండు సినిమాలు కూడా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి.

Sankranti movies creating wonders at Box Office and Mahesh Babu Allu Arjun collects over 400 crores pk ముందు నుంచి కూడా 2020 సంక్రాంతిపై భారీ అంచనాలే ఉన్నాయి. 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి పండక్కి రాబోతున్నారని తెలిసి చాలా అంచనాలే వేసుకున్నారు ట్రేడ్ పండితులు. sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Sarileru Neekevvaru collections,Mahesh Babu Sarileru Neekevvaru movie,ala vaikuntapurramuloo collections,sankranti 400 crore,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,
సరిలేరు నీకెవ్వరు,అల వైకుంఠపురములో మూవీ పోస్టర్ వార్ (Twitter/Photos)


2020 సంక్రాంతికి 400 కోట్లకు పైగా వసూలు చేయడం తెలుగు సినిమాకు శుభ పరిణామం. కొన్నేళ్లలో ఏ సంక్రాంతి కూడా ఇంతగా కాసుల వర్షం కురిపించలేదు. 2017లో ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు విజయం సాధించినా కూడా ఇన్ని వందల కోట్లు అయితే రాలేదు. ఇక 2016లో సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్‌ప్రెస్ రాజా, నాన్నకు ప్రేమతో సినిమాలు ఒకే పండక్కి వచ్చి విజయం సాధించాయి. మొత్తానికి సినిమాలు బాగుంటే ఎన్ని వచ్చినా కూడా పండగ సీజన్‌లో విజయం సాధిస్తాయని మరోసారి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో నిరూపించాయి. ఇదే జోరు వచ్చే సినిమాలు కూడా కొనసాగిస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 24న డిస్కో రాజా సినిమాతో వస్తున్నాడు రవితేజ.
Published by: Praveen Kumar Vadla
First published: January 21, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading