Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 1, 2019, 11:20 AM IST
సంక్రాంతి సినిమాలు 2019
సంక్రాంతికి ఎవరికి వారు తాము వస్తున్నామంటూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు వరసగా నాలుగు రోజులు నాలుగు భారీ సినిమాలు వస్తున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తుంటే బయ్యర్లు కూడా వణికిపోతున్నారు. సినిమాలు వస్తాయి సరే మరి వాటన్నింటికీ థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి. పోనీ అని చిన్న సినిమాలా అంటే అదీ కాదు.. ఒక్కో సినిమాకు కనీసం 50 నుంచి 100 కోట్లు వచ్చే సత్తా ఉంది. మరి ఇలాంటి సినిమాలు నాలుగు ఒకేసారి వస్తే డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నష్టం వస్తుంది అనేది ఎవరూ ఆలోచించడం లేదు.

వినయ విధేయ రామ ట్రైలర్
పైగా నాలుగు భారీ సినిమాలకు సరిపోయే థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల కింద సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఆ నాలుగు రెండు మాత్రమే విజయం సాధించాయి. ఈ సారి కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏంటి అని భయపడుతున్నారు బయ్యర్లు. 2016లో ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘డిక్టేటర్’ సినిమాలు వచ్చాయి. ఇవన్నీ క్రేజీ సినిమాలే అయితే సరైన థియేటర్లు లేక పండగ సీజన్ లో చాలా ఇబ్బంది పడ్డాయి.

సంక్రాంతి సినిమాలు 2016
ఈ నాలుగు సినిమాలు ఒకేసారి రావడంతో కలెక్షన్లు కూడా నష్టపోయారు. 2017 లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు ‘ఖైదీ నెంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శతమానంభవతి’ సినిమాలు వచ్చాయి. ఈ మూడు మంచి విజయం సాధించాయి. కానీ కనీసం మూడు నాలుగు రోజుల గ్యాప్లో వచ్చి ఉంటే మరింత భారీ కలెక్షన్లు సాధించి ఉండేవని అప్పట్లో వార్తలు బాగానే వినిపించాయి. ఇక ఇప్పుడు మరోసారి 2019లో నాలుగు భారీ సినిమాలు ఒకేసారి వస్తున్నాయి.

సంక్రాంతి సినిమాలు 2017
జనవరి 9న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. రజనీకాంత్ ‘పేట’.. 11న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’.. 12న వెంకటేష్ వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ సినిమాలు విడుదల కానున్నాయి. మరి వీటికి సరిపోయేన్ని థియేటర్లు దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1600 థియేటర్లను ఈ నాలుగు సినిమాలు ఎలా పంచుకుంటాయో చూడాలి. అయితే ‘వినయ విధేయ రామ’ వెనక అల్లు అరవింద్.. ‘ఎఫ్2’ సినిమా వెనక సురేష్ బాబు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్, ‘పేట’ వెనక ఎవరున్నారు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఎన్టీఆర్ పోస్టర్
పైగా చరణ్ సినిమా ఏకంగా 90 కోట్ల బిజినెస్.. ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ 60 కోట్లు.. ‘ఎఫ్2’ సినిమా 30 కోట్లకు పైగానే బిజినెస్ చేసాయి. మరి ఇంత ఇంత బిజినెస్ చేసిన సినిమాలకు ఒకే రోజు వ్యవధిలో విడుదల అవుతుండటం ఎంతవరకు కలిసి వస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న వాదన.
రష్మిక మందన్న హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
Published by:
Praveen Kumar Vadla
First published:
January 1, 2019, 11:20 AM IST