Sankranthi Programs: సాధారణంగానే పండుగలు వస్తున్నాయంటే ప్రతి ఛానెల్ వాళ్లు ఏదో ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లోలోనే పండుగలు జరుపుకుంటూ ఇంటికి పరిమితం కావడంతో.. అందరినీ ఆకట్టుకునేందుకు మరింత ఇంట్రస్టింగ్ ప్రోగ్రామ్స్‌తో వీక్షకులను పలకరిస్తున్నాయి. అందులోనూ మొన్నటివరకు థియేటర్లు కూడా లేకపోవడంతో.. టీవీలలో వచ్చే ప్రోగ్రామ్‌లకు మంచి టీఆర్పీ రేటింగ్‌లు వచ్చాయి. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలో బరిలో ఉన్నాయి. అయితేనేం ఎంత థియేటర్లలో సినిమాలు విడుదల అయినా.. బుల్లితెర వీక్షకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్రాంతికి పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు స్పెషల్ ప్రోగ్రామ్‌లను ప్రసారం చేయనున్నాయి. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఈ క్రమంలో ఏఏ ఛానెల్లో ఏఏ ప్రోగ్రామ్‌లు వస్తున్నాయంటే..
అత్తో అత్తమ్మ కూతురో
పండుగకు స్పెషల్ ప్రోగ్రామ్‌లు అంటే వెంటనే గుర్తొచ్చే ఛానెల్ ఈటీవీ. కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రతి పండుగకు ప్రోగ్రామ్‌లను చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంక్రాంతికి అత్తో అత్తమ కూతురు అన్న పేరుతో ప్రోగ్రామ్ రానుంది. ఇందులో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్‌లతో పాటు ఢీ ప్రోగ్రామ్‌లతో పాల్గొన్న కొందరు కూడా భాగం అవ్వనున్నారు. అత్తగా రోజా కనిపిస్తుండగా.. ఆమె కుమార్తెలుగా అనసూయ, రోహిణి, వర్ష.. అల్లుళ్లుగా ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుల్, ఆది కనిపించనున్నారు. అలాగే రోజా మేనల్లుడుగా ప్రదీప్ మాచిరాజు, పక్కింటి అమ్మాయిగా రష్మి కనిపించనుంది. ఇక వారు పలు స్కిట్లు, డ్యాన్స్ లు వేయనుండగా.. వాటికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ప్రస్తుతం తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌గా పేరొందిన స్టార్ మా సీరియళ్లకే కాదు, స్పెషల్ ప్రోగ్రామ్‌లకు పెట్టింది పేరు. ఈటీవీతో పోటీ పడి వీరు ప్రోగ్రామ్‌లను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ పేరుతో ప్రోగ్రామ్ని ప్రసారం చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి ఫేమస్ యాంకరింగ్ జోడీ రవి, లాస్య ఐదేళ్ల తరువాత తొలిసారిగా యాంకరింగ్ చేస్తున్నారు. ఇక ఇందులో బాబా భాస్కర్ మాస్టర్, మాటీవీ సీరియళ్ల నటీనటులు, వారి కుటుంబ సభ్యులు, కొంతమంది కమెడియన్లు పాల్గొననున్నారు. అలాగే బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజీత్, తన తల్లితో పాటు రానుండగా.. అరియానా, అవినాష్ కూడా ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Eesari #Sankranthi manaintlo mamoolu sandadi undadu..Come and join us to celebrate the festival.#ItsAFamilyParty #SankranthiSpecial pic.twitter.com/GWPAevfUpP
— starmaa (@StarMaa) January 6, 2021
సంక్రాంతి సంబరాలు
ఇక జీ తెలుగులో సంక్రాంతి సంబరాలు పేరిట పండుగ రోజు ప్రోగ్రామ్ రానుంది. శ్రీముఖి ఈ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేయనుంది. జీ తెలుగు సీరియల్లో నటించే వారితో పాటు అదిరింది టీమ్, నవదీప్ తదితరులు పాల్గొననున్నారు. అలాగే హీరో రామ్ తన రెడ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సంక్రాంతి సంబరాలులో సందడి చేయనున్నారు.
నూతన ఉత్సహం తో, సరికొత్త ఆట, పాటలు తో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు🤩
ఈ సారి సంబరాలు మాములుగా ఉండదు 🔥
Here’s the promo of Zee Telugu #SankranthiSambaralu2021 Coming Soon only on #ZeeTelugu #2021పండగలుwithZEETelugu #Sankranthi2021🌾 @pnavdeep26 @MukhiSree #VJSunny #Saddam pic.twitter.com/UIBUAX0szZ
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 6, 2021
వీరందరితో పాటు ప్రముఖ నృత్యకళాకారిణి మయూరి సుధాచంద్రన్ ప్రత్యేక నృత్య ప్రదర్శనను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్‌లు కూడా విడుదల కాగా అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ ప్రోగ్రామ్‌లతో ఈ సంక్రాంతి వీక్షకులకు మరింత సందడిగా మారనున్నట్లు అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sankranti, Star Maa, Television News