ఈ సారి సంక్రాంతి బరి నుంచి ఆర్ఆర్ఆర్ (RRR) తప్పుకోవడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఈసారి 2022 సంక్రాంతికి మొదటగా భీమ్లానాయక్, సర్కారువారిపాట, రాధేశ్యామ్ రేస్‌లో ఉన్నాయి. అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ రావడంతో సర్కారువారిపాట, భీమ్లానాయక్ ఇండస్ట్రీ మేలు కోసం నిర్మాతలు, హీరోలు కలసి ఏప్రిల్‌కు వాయిదా వేసుకొన్నారు. తాజాగా ఒమిక్రాన్ కేసులు, ఏపీ టికెట్ గొడవలు మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో చిన్న సినిమాలు తెరమీదకు వచ్చాయి. రాధేశ్యామ్ సినిమా ఇప్పటికైతే వాయిదా పడలేదు. మూవీ మేకర్స్ మాత్రం సినిమా విడుదలలో మార్పులేదని అంటున్నారు. ఎప్పటి నుంచో సంక్రాంతి బరిలో ఉన్న నాగార్జున బంగార్రాజు ఏదా విధిగా విడుదల అవుతుంది. వీటితోపాటు ఎనిమిది తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చాయి.
Allu Arjun: ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్‌కు "అల్లు అర్జున్ గండం".. మళ్లీ 2020 సీన్ రిపీట్ అవుతుందా!
ఆర్ఆర్ఆర్ ఉంటుందన్న నేపథ్యంలో ఈ సినిమాలు పెద్దగా ప్రమోషన్ చేయలేదు. ఇప్పటి వరకు ఎటువంటీ హడావిడి లేకుండా ఒక్కసారే సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చాయి. డీజే టిల్లు, రౌడీబాయ్స్, సూపర్‌మచ్చి, 7 రోజులు 6 రాత్రులు, అతిథిదేవోభవ, శేఖర్, 1945 సినిమా, డబ్బింగ్ మూవీ వాలిమై సంక్రాంతి రేసులో ఫ్యాన్స్‌ను పలకరించ నున్నాయి.
Bollywood: ఆ బైక్ నంబర్ ప్లేట్ నాదే.. బాలీవుడ్ హీరోపై పోలీసులకు ఫిర్యాదు!
కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. మరో 10 రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ సమయంలో సినిమా విడుదల చేశాక.. ప్రభుత్వాలు థియేటర్లపై ఆంక్షలు పెడితే సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వాలతో చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుత ధరలతో సినిమా విడుదల చేస్తే గిట్టుబాటు కాదని కూడా పెద్ద సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డా కూడా.. పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు ప్రయత్నాలు చేయడం లేదు.
చిన్న సినిమాలకే చాన్స్..
ఎప్పుడు పెద్ద సినిమాలతో కళకళలాడే సంక్రాంతి. ఈ సారి రాధేశ్యామ్ (RadheShyam), బంగార్రాజు (Bangarraju) మినహా.. అన్ని చిన్న సినిమాలే. ఇది ఇండస్ట్రీకి మంచి అవకాశం అని కూడా కొందరు అంటున్నారు. చిన్న సినిమాలు హిట్ అయితే. కాస్త ఊరటగా ఉంటుంది. సెలవులు కావడంతో ప్రేక్షకులు కూడా కొత్త సినిమాలకు వెళ్లే వీలుంటుదని అంటున్నారు..
Vidya Balan: కుర్రకారుకు వేడెక్కిస్తున్న విద్యాబాలన్.. తాజా ఫోటో షూట్
ఇటు తక్కువ.. అటు ఎక్కువ
టికెట్ రేట్ల విషయంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి అన్ని చిన్న చిత్రాలు విడుదల అవుతున్నాయి. తెలంగాణ (Telangana) లో టికెట్లు రేట్లు పెంచడంతో ఫ్యాన్స్ ఈ సినిమాలకు వస్తారా రారా తెలియదు. ఎందుకంటే పెద్ద హీరో సినిమా అంటే ధర చూడకుండా టికెట్ కొనేస్తారు. చిన్న వాటికి కష్టం అనే అభిప్రాయం ఇక్కడ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న ధరలకు చిన్న సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకొంటాయో చూడాల్సి ఉంది. చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేయడంతో సినిమా విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangarraju, Box Office Collections, Radhe Shyam, RRR, Sankranthi film, Telugu movies