KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు తీసుకుంటున్నారు.
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. విడుదలై రెండు నెలలకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది.
KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
గతంలో సంజయ్ దత్..నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’లో నటించారు. ఇపుడు 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ ఒక దక్షిణాదిలో సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం మున్నాభాయి హిందీలో పలు పెద్ద ప్రాజెక్ట్స్‌లో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.