Sanjay Dutt ఆరోగ్యంపై భార్య మాన్యతా దత్ వివరణ..

Sanjay Dutt Latest News | బాలీవుడ్ ఖల్ నాయక్.. సంజయ్ దత్.. శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని  లీలావతి ఆస్పత్రిలో చేరడంపై ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై సంజయ్ దత్ భార్య మాన్యతా ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది.

news18-telugu
Updated: August 12, 2020, 4:53 PM IST
Sanjay Dutt ఆరోగ్యంపై భార్య మాన్యతా దత్ వివరణ..
సంజయ్ దత్ భార్య మాన్యత దత్ (File/Photo)
  • Share this:
బాలీవుడ్ ఖల్ నాయక్.. సంజయ్ దత్.. శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని  లీలావతి ఆస్పత్రిలో చేరడంపై ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. బ్రీతింగ్  ప్రాబ్లెమ్‌తో సంజూ బాబా ఆస్పత్రిలో చేరడంతో ముందుగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగిటివ్ వచ్చింది. తీరా మున్నాభాయ్‌‌కి ఊపిరితిత్తుల కాన్సర్ అంటూ డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఇపుడది మూడో స్టేజ్‌లో ఉందన్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం సంజూ బాబా అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సందర్భంగా సంజయ్ దత్ భార్య మాన్యత మీడియాకు ఓ లెటర్ విడుదల చేసింది. ఈ లెటర్‌లో ఆమె మాట్లాడుతూ.. సంజయ్ దత్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్ధించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు సంజయ్ దత్ జీవితమే పోరాట మయం. ఆయన తన జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. కాన్సర్‌తో గతంలో తల్లిని పోగుట్టుకున్నాడు. ఆ తర్వాత టాడా కేసులో జైలు జీవితం గడిపాడు.


అలాగే ఈ క్యాన్సర్‌ను కూడా సంజయ్ జయిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయమై అనవసరమైన సమాచారాన్ని మాత్రం వ్యాప్తి చేయకండి అంటూ వేడుకుంది. ప్రస్తుతం సంజయ్ దత్త పలు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసాడు. మరోవైపు ఈయన ప్రధాన పాత్రలో నటించిన ‘సడక్ 2’తో పాటు ‘భుజ్’ సినిమాలు డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. మరోవైపు సంజయ్ దత్.. కేజీఎఫ్ 2లో అధిరా పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు తెలుగులో చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేయమని ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడున్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా సంజయ్ దత్.. కొన్నాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితం అయి క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోనున్నాడు. ఆ తర్వాత కానీ కొత్త సినిమాలపై ఆలోచించే అవకాశాలున్నాయి. ఇక కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 12, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading