KGF Chapter 2 - Sanjay Dutt: కేజీఎఫ్ -2లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అథీరాగా పని కనిపించనున్నాడు. సినిమాలో ఈ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటీవల సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా అథీరా లుక్ విడుదల చేశారు. ఈ పోస్ట్రకు సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అథీరా క్యారెక్టర్‌కు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సంజయ్‌దత్ ఇన్‌స్టాలో షేర్ చేశారు.
KGF Chapter 2 - Sanjay Dutt: కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ కన్నడలో తప్ప.. ఏ భాషలో అంతగా అంచనాలు లేవు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. సౌత్ నుంచి ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా యశ్ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాలో కేజీఎఫ్ చాప్టర్-2లో సంజయ్ దత్(Sanjay Dutt) అధీర పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో ఆ పాత్రను బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్తో చేయిస్తున్నారు.
ఇప్పటికే అథీరాగా విడుదలైన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించి డబ్బింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పిక్స్‌ను సంజయ్‌దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
KGF 2, సాలార్ టీమ్‌లు 2022లో బాక్సాఫీస్ వద్ద ఢీకొంటాయని ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు సంజయ్ దత్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. తన చివరి డబ్ సెషన్ నుంచి చిత్రాలను పంచుకున్నాడు. ఈ సందర్బంగా సంజయ్ దత్ ఇన్‌స్టాలో ఇలా పోస్ట్ చేశారు. “అధీర మళ్లీ యాక్షన్‌లోకి వచ్చాడు! #KGFchapter2 కోసం డబ్బింగ్ సెషన్లు పూర్తయ్యాయి మరియు 14 ఏప్రిల్ 2022న మీ థియేటర్లలోకి రాబోతున్నాయి!”
మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఆ సంగతి పక్కన పెడితే.. ఈసినిమాను ముందుగా జూలై 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా కూడా విడుదల వాయిదా పడింది.
KGF చాప్టర్ 2 జూలై 16న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా, చిత్రం యొక్క థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్ , అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022 న బహుళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.