సంజయ్ దత్, ఆలియా భట్‌ ‘సడక్ 2’ ట్రైలర్‌కు షాకుల మీద షాకులు..

బాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. తాజాగా విడులైన ‘సడక్ 2’ ట్రైలర్‌‌కు అభిమానులు షాకులు మీద షాకులు ఇచ్చారు.

news18-telugu
Updated: August 12, 2020, 5:33 PM IST
సంజయ్ దత్, ఆలియా భట్‌ ‘సడక్ 2’ ట్రైలర్‌కు షాకుల మీద షాకులు..
’సడక్ 2’ ట్రైలర్‌కు డిస్ లైక్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్‌ ఉన్న ఈ నటుడు అకాల మరణం చెందడం వెనక బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం అనే కారణాలు వినిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ సంగతి పక్కనపెడితే.. ముఖ్యంగా సుశాంత మరణం వెనక కరణ్ జోహార్, ఆలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో పాటు మహేష్ భట్ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్ల వరద కొనసాగుతోంది.


ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్ లైక్‌తో  చిత్ర దర్శక, నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఈ ట్రైలర్‌ లైక్స్, డిస్ లైక్స్‌కు దాదాపు 80 శాతం తేడా ఉంది. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని, అంతేకాదు అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్ స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్‌ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు.

Uninstall Hotstar: సడక్ 2ను బహిష్కరించండి.. ఆలియా మహేష్‌ భట్‌లకు షాక్..‌‌ Netizens are Trending Uninstall Hotstar on Twitter here are the details
Uninstall Hotstar: ఆలియా మహేష్‌ భట్‌లకు షాక్..‌‌ సడక్ 2ను బహిష్కరించాలని డిమాండ్.... Photo : Twitter


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. అక్కడి దర్శక నిర్మాతలు హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటీ అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన అభిమానులు. అందులో భాగంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 12, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading