Sanjay Dutt | శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరిన సంజయ్ దత్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు.

news18-telugu
Updated: August 8, 2020, 10:50 PM IST
Sanjay Dutt | శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరిన సంజయ్ దత్
సంజయ్ దత్ (File/Photo)
  • Share this:
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. సంజయ్ దత్‌కు శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. అలాగే, ఛాతీలో సమస్య వచ్చింది. సంజయ్ దత్‌కు కోవిడ్ 19 పరీక్ష నిర్వహించగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. సంజయ్ దత్ నుంచి స్వాబ్ కలెక్ట్ చేసి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేసినట్టు లీలావతి ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. నాన్ కోవిడ్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సంజయ్ దత్‌కు మరికొన్ని పరీక్షలు చేయనున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఇటీవల చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. సంజయ్ దత్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తోర్బాజ్, సడక్ 2, భుజ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 8, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading