బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య హిందీ సినీమా ఇండస్ట్రీలో పెద్దల బాగోతాన్ని, వాళ్లు ఎలా సినిమాలను, నటులను ప్రభావితం చేస్తారో చూపెడుతోంది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజం (బంధుప్రీతి) పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా గతనెల 14వ తేదీన సుశాంత్ ముంబై, బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో సినీ భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. ఇక ఆయన మరణం పట్ల రకరకాల రూమర్స్‌తో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అది అలా ఉంటే గతంలో మీటూ ఉద్యమంలో సుశాంత్ పేరు కూడా వినిపడిన సంగతి తెలిసిందే. సంజనా సంఘీ అనే కొత్త అమ్మాయిని సుశాంత్ వేధించాడని ఆ వార్తల సారాంశం. సంజనా దిల్ బచారా అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా చేస్తున్నాడు.
తాజాగా సుశాంత్ మరణంపై పోలీసుల విచారణ నేపథ్యంలో సంజనా తనపై సుశాంత్ వేధింపులకు పాల్పడ్డాడన్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. సుశాంత్ తనను ఎలాంటీ వేధింపులకు గురిచేయలేదని.. సుశాంత్ తనతో ఎంతో మర్యాదగా మసులుకునేవాడని తెలిపింది. దీంతో కావాలనే కొందరూ పెద్దలు సుశాంత్‌పై బురద చల్లే ప్రయత్నం చేశారని చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇండస్ట్రీలో కొందరు సుశాంత్ పేరును, ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఇలా దొంగ దెబ్బ కొట్టి తనకు ఆఫర్స్ రాకుండా ప్రయత్నించారని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, MeToo movement, Sushanth singh Rajputh