అర్జున్ రెడ్డి కాంబో రిపీట్స్.. సందీప్ వంగాతో విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మార్చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. మెడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2020, 8:05 PM IST
అర్జున్ రెడ్డి కాంబో రిపీట్స్.. సందీప్ వంగాతో విజయ్ దేవరకొండ..
సైమాలో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా (Vijay Devarakonda Sandeep Reddy Vanga)
  • Share this:
విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మార్చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. మెడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. తమిళనాట వర్మగా.. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా సంచలనాలు సృష్టించింది అర్జున్ రెడ్డి. అలాంటి సంచలన కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది. ఇప్పుడు అదే జరగబోతుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో మరో సినిమాకు సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్.

సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ (sandeep reddy vijay devarakonda)
సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ (sandeep reddy vijay devarakonda)


ఇక విజయ్ దేవరకొండకు కూడా అక్కడ మంచి ఇమేజ్ ఉంది. దాంతో ఈ ఇద్దరూ కలిసి ప్యాన్ ఇండియా సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి సందీప్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ రణబీర్ సింగ్‌తో పక్కా క్రైమ్ డ్రామాగా రూపొందించాలనుకున్నాడు. అసలైన క్రైమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపిస్తానని ఛాలెంజ్ కూడా చేసాడు సందీప్ రెడ్డి వంగా. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. బాలీవుడ్ హీరోలంతా ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలని చూస్తున్నాడు సందీప్. తన కెరీర్‌లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన సందీప్‌తో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెప్పి ఇప్పటికే విజయ్ దేవరకొండ చెప్పాడు. పైగా ఇప్పుడు ఈయన కెరీర్ కూడా చాలా డైలమాలో ఉంది.

సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ (sandeep reddy vijay devarakonda)
సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ (sandeep reddy vijay devarakonda)


భారీ అంచనాల మధ్య వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం ఫైటర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి సినిమా చేయాలనుకుంటున్నాడు విజయ్. అవసరం అయితే ఈ చిత్రం కోసం శివ నిర్వాణ చిత్రాన్ని వాయిదా వేయడానికి కూడా విజయ్ సిద్ధంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. పైగా శివ కూడా నాని టక్ జగదీష్ పూర్తైన తర్వాత కానీ విజయ్ సినిమాపై ఫోకస్ చేయడు. దాంతో సందీప్ వంగాని పాన్ ఇండియా స్క్రిప్ట్ తో కథ తయారు చెయ్యమని విజయ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అన్నీ కుదిరి ఈ ప్రాజెక్ట్ కానీ వర్కవుట్ అయిందంటే మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్ మరోసారి గాడిన పడ్డట్లే.
Published by: Praveen Kumar Vadla
First published: February 19, 2020, 8:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading