Home /News /movies /

SANDALWOOD DRUGS RACKET KANNADA ACTOR RAGINI DWIVEDI GETS DETAINED BY CCB SMILES AND WAVES TO CAMERAS SK

పోలీసుల అదుపులో ప్రముఖ నటి.. ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు

రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది

హీరోయిన్ రాగిణి ఫ్రెండ్ రవి శంకర్ అరెస్ట్ అయ్యాడు. అతడి విచారణలో కీలక వివరాలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కూపీ లాగినట్లు తెలుస్తోంది.

    కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ రాకెట్ కేసు ప్రకంపనలు రేపుతోంది. శాండల్ వుడ్‌లో ఎంతో మంది సెలబ్రిటీలు డ్రగ్స్‌కు బానిసయ్యారని.. షూటింగ్స్, రేవ్ పార్టీల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ ఇంద్రజిత్ లంకేష్ ఆరోపించడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కొందరి పేర్లు కూడా ఆయన చెప్పడంతో వారందరికీ సమన్లు పంపిస్తున్నారు. మొదట హీరోయిన్ రాగిణి ద్వివేది నోటీసులకు పంపించగా..ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బెంగళూరులో రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఆగస్టు 21 ఓ డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్ కావడంతో.. శాండల్ వుడ్ లింకులు బయటపడ్డాయి. అతడి డైరీలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు పేర్లు ఉండడంతో సంచలనంగా మారింది. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ఫ్రెండ్ రవి శంకర్ అరెస్ట్ అయ్యాడు. అతడి విచారణలో కీలక వివరాలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కూపీ లాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాగిణికి నోటీసులు పంపినా ఆమె విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాగిణి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు పోలీసులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాగిణి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

    ఆగస్టు 21న బెంగళూరు శివారులోని రాయల్ సూట్స్ హోటల్‌లో NCB అధికారులు సోదాలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 145 MDMA పిల్స్‌, రూ.2.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురి అరెస్ట్‌ చేసి విచారించగా మరికొందరి లింకులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆగస్టు 26న కన్నడ టెలివిజన్ మాజీ నటి డి. అంకితతో పాటు రవిచంద్రన్, అనూప్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Drugs, Drugs racket, Kannada Cinema, Sandalwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు