Ragini Dwivedi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి మరోసారి నిరాశ ఎదురైంది. ఈమెకు బెయిల్ నిరాకరిస్తూ కోర్ట్ మరోసారి స్టే విధించింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి మరోసారి నిరాశ ఎదురైంది. ఈమెకు బెయిల్ నిరాకరిస్తూ కోర్ట్ మరోసారి స్టే విధించింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. దయచేసి బెయిల్ ఇప్పించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది. కొన్ని రోజులుగా జైల్లోనే ఉన్నా కూడా ఈమెకు మాత్రం బెయిల్ రాలేదు. స్పెషల్ కోర్టులు.. కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో చివరగా అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించింది రాగిణి. కానీ అక్కడ కూడా ఈమెకు నిరాశే ఎదురైంది. రాగిణి నిందితురాలే అని.. ఆమెకు కచ్చితంగా డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలున్నాయని.. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని బెంగుళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు సుప్రీంలో కౌంటర్ దాఖలు చేశారు. దాంతో ఈమెకు బెయిల్ నిరాకరించింది సుప్రీం కోర్టు. రాగిణి బయటికి వస్తే కచ్చితంగా సాక్ష్యాలు తారుమారు చేస్తారనే వాదనలు కూడా వినిపించడంతో ఈమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీం నెగిటివ్‌గా స్పందించింది. ఇందుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా విచారణ వాయిదా పడింది. డ్రగ్స్ మాఫియా కేసులో రాగిణిని గతేడాది సెప్టెంబర్ 4న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. గంజాయితో నింపిన సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొబైల్స్ సీజ్ చేశారు. ఈమెతో పాటు మరో హీరోయిన్ సంజనా గర్లానీ కూడా అరెస్ట్ అయింది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది. కానీ రాగిణి మాత్రం ఇప్పటికీ జైల్లోనే ఉంది.