Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు.. నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇంట్లో సోదాలు

    బాలీవుడు నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇంట్లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ముంబైలోని వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు

    news18-telugu
    Updated: October 15, 2020, 3:13 PM IST
    శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు.. నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇంట్లో సోదాలు
    వివేక్ ఓబ్రాయ్(Vivek Oberoi)
    • Share this:
    బాలీవుడు నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇంట్లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ముంబైలోని వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. శాండల్ డ్రగ్స్ కేసులో వివేక్ బంధువు అదిత్య అల్వాకు సంబంధాలు ఉండటంతో వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించడంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. " అదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వివేక్ ఆదిత్యకు బంధువు కావడంతో అతని గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని సోదాలు చేపట్టాం. ఇందుకు సంబంధించి కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నాం. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ బృందం ముంబైలోని అతని నివాసాని వెళ్లింది"  అని తెలిపారు.

    మరోవైపు అధికారులు బెంగళూరులోని అదిత్య అల్వా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కర్ణాటక మాజీ మంత్రి, జీవరాజ్‌ కుమారుడు అదిత్య అల్వా. అదిత్య సోదరి ప్రియాంకను వివేక్ వివాహం చేసుకున్నారు. ఇక, పలువురు సింగర్స్, కన్నడ సినీ ప్రముఖలకు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో అదిత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అదిత్యతో పాటు శివప్రకాశ్ చుప్పి, షేక్ ఫాజిల్‌ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా సమాచారం.

    శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు ఇప్పటికే పలు సంచనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణిలను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్ మాఫియాతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా?, వారు ఏ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారని కూడా ఆరా తీస్తున్నారు. అలాగే వారిచ్చిన సమాచారం ఆధారంలో మరికొందరికి నోటీసులు జారీచేసి విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by: Sumanth Kanukula
    First published: October 15, 2020, 2:49 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading