బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రముఖ నటుడు వివేక్ ఓబ్రాయ్ భార్య ప్రియాంక అల్వాకు నోటీసుకు జారీచేశారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసుతో ప్రియాంక సోదరుడు అదిత్యకు ఈ కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు ఆమెకు పంపారు
బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రముఖ నటుడు వివేక్ ఓబ్రాయ్ భార్య ప్రియాంక అల్వాకు నోటీసుకు జారీచేశారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసుతో ప్రియాంక సోదరుడు అదిత్యకు ఈ కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు ఆమెకు పంపారు. శాండల్ డ్రగ్స్ కేసుతో సంబంధాలు కలిగిఉన్న ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. శాండల్‌వుడ్ సింగర్స్‌కు, నటీనటులకు డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఆదిత్యపై ఆరోపణలు ఉన్నాయి. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న చాలా మంది హెబ్బల్ లేక్ సమీపంలోని ఆదిత్యకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలకు హాజరైనట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు.
అయితే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఆదిత్యతో పాటు మరో ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆదిత్యతో పాటు వారు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు ముంబైలోని వివేక్ ఓబ్రాయ్ నివాసంలో గురువారం సోదాలు నిర్వహించారు. వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించడంపై పోలీసులు మాట్లాడుతూ.. "అదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వివేక్ ఆదిత్యకు బంధువు కావడంతో అతని గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని సోదాలు చేపట్టాం. ఇందుకు సంబంధించి కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నాం. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ బృందం వివేక్ ఇంట్లో సోదాలు జరిపారు" అని తెలిపారు.
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు కన్నడ నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణి, రేవ్ పార్టీ నిర్వాహకులు విరేన్ కన్నాలతో పాటు పలువురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ఇలా మొత్తంగా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరి వద్ద నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురిని పోలీసులు విచారించారు. అలాగే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక, అదిత్య అల్వా కర్ణాటక మాజీ మంత్రి, జీవరాజ్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. అదిత్య సోదరి ప్రియాంకను వివేక్ వివాహం చేసుకున్నారు.