హోమ్ /వార్తలు /సినిమా /

Sandalwood Actor Shanaya Katwe Arrest: సోదరుడి హత్య కేసులో ప్రముఖ నటి అరెస్ట్..

Sandalwood Actor Shanaya Katwe Arrest: సోదరుడి హత్య కేసులో ప్రముఖ నటి అరెస్ట్..

శనన్య కత్వే అరెస్ట్ (Twitter/Photo)

శనన్య కత్వే అరెస్ట్ (Twitter/Photo)

Shanaya Katwe: సోదరుడి హత్య కేసులో ప్రముఖ నటి శనన్య కత్వేను పోలీసులు  అరెస్ట్ చేసారు.

  Shanaya Katwe: సోదరుడి హత్య కేసులో ప్రముఖ నటి శనన్య కత్వేను పోలీసులు  అరెస్ట్ చేసారు. ఈమె తన సోదరుడు రాకేష్ కత్వేను కొంత మంది వ్యక్తులకు సుపారీ ఇచ్చి ఈ హత్యను చేయించినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సదరు వ్యక్తి హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేసారు. ఇక మృతుడి తల మాత్రం దేవరగుడిహాల్‌ అడవుల్లో పోలీసులకు దొరికింది. మిగిలిన శరీర భాగాలను హుబ్బల్లిలోని  వేర్వేరు ప్రదేశాల్లో పడేసారు. ఈమెను హుబ్బల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో నియాజాహెమద్, తౌఫిక్ చన్నాపూర్, అల్తాఫ్ ముల్లా, మరియు అమన్ గిరినివాలే ను పోలీసులు అరెస్ట్ చేసారు.

  ఇక పోలీసులు శనన్య కత్వేను ఏప్రిల్ 22న అరెస్ట్ చేసిన జుడిషనల్ కష్టడిలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈమె బ్రదర్ చంపించానికి లవ్ ఎఫైర్ కారణం అని పోలీసులు వెల్లడించారు. ఈమెకు నియాజాహెమద్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను వీళ్ల బ్రదర్ రాకేష్ కత్వే అంగీకరించలేదు. దీంతో ప్రియుడితో కలిసి అన్నయ్యను పథకం ప్రకారం హత్య చేయించినట్టు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడించారు.


  ఇక శనన్య కత్వే ప్రియుడు తన స్నేహితులు కొందరితో కలిసి ఆమె అన్నయ్యను ఏప్రిల్ 9న  అతని ఇంట్లోనే హత్య చేసి ముక్కలు ముక్కలు చేసేసారు. అంతేకాదు అతని శరీరం ఆనవాళ్లు లేకుండా వేర్వేరు ప్రదేశాల్లో బాడీ పార్ట్‌లను డంప్ చేసారు. అదే రోజు ప్లాన్ ప్రకారం  శనన్య తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో పాల్గొంది.


  శనన్య కత్వే విషయానికొస్తే.. ఈమె మెడల్ నుంచి హీరోయిన్‌గా మారింది. 2018లో రాఘవేంద్ర ప్రభు దర్శకత్వంలో ‘ఇదమ్ ప్రేమమ్ జీవనమ్’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్‌గా ఈ భామ ‘ఒందు ఘంటేయ కథే’ అనే అడల్ట్ కామెడీ సినిమాలో నటించింది. ఈమె తన అన్నయ్య హత్య చేయించడంపై కన్నడ ఇండస్ట్రీ  ప్రముఖులు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kannada Cinema, Sandalwood

  ఉత్తమ కథలు