Sanjana: ఇస్లాం మతంలోకి మారిన సంజనా.. ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ భామ..

Sanjana Islam | డ్రగ్స్ రాకెట్ కేసులో రాగిణి ద్వివేదితో పాటు ప్రముఖ నటి సంజనా పేరును పోలీసులు వెల్లడించారు. అంతేకాదు డ్రగ్స్ కేసులో రాగిణితో పాటు సంజనా గర్లానీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటూ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సంజ‌నాకు సంబంధించిన మ‌రో వార్త కూడా ఇపుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. సంజ‌నా రెండేళ్ల క్రితం ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించింది.

news18-telugu
Updated: September 20, 2020, 11:03 PM IST
Sanjana: ఇస్లాం మతంలోకి మారిన సంజనా.. ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ భామ..
ఇస్లాంలోకి మారిన సంజనా (File/Photo)
  • Share this:
Sanjana Islam | కన్నడ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు డ్రగ్స్‌ మత్తులో మునిగితేలుతోంది. అక్కడ ఈ కేసు రోజురోజుకీ మరింత ముదురుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కరితో మొదలైన వ్యవహారం ఇండస్ట్రీ మొత్తాన్ని పట్టి పీడిస్తుంది. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారనేది కూడా అర్థం కావడం లేదు. డ్రగ్స్ రాకెట్ కేసులో రాగిణి ద్వివేదితో పాటు ప్రముఖ నటి సంజనా పేరును పోలీసులు వెల్లడించారు. అంతేకాదు డ్రగ్స్ కేసులో రాగిణితో పాటు సంజనా గర్లానీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటూ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.  సినీ కెరీర్ లో అంత‌గా స‌క్సెస్ లేని సంజ‌నా పేరు మీద భారీ మొత్తంలోనే ఆస్తులున్న‌ట్టు బెంగ‌ళూరు పోలీసులు గుర్తించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా సంజ‌నాకు సంబంధించిన మ‌రో వార్త కూడా ఇపుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. సంజ‌నా రెండేళ్ల క్రితం ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించింది. ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్ ఇపుడు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతోంది.

సంజనా ఇస్లాం స్వీకరించనట్టు దారుల్ ఉలుమ్ సర్టిఫికేట్ (Twitter/Photo)


ఈమె బెంగళూరులోని దారుల్ ఉలుమ్ షా వలిఉల్లామ్ మజీదు ద్వారా ఇస్లాం స్వీకరించినట్టు ఓ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్లామ్‌లోకి మారిన తర్వాత సంజనా తన పేరును మహిరాగా మార్చుకున్నట్టు ఆ సర్టిఫికేట్‌లో ఉంది.  అయితే సంజ‌నా ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన విష‌యంపై పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. తాను సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాన‌ని పోలీసుల విచార‌ణ‌లో తెలిపిన సంజ‌న‌..పోలీసులు డాక్ట‌ర్ అజీజ్ పాషాతో జ‌రిగిన నిశ్చితార్థం ఫొటోను చూపించే స‌రికి ఏం ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. మొత్తానికి డ్రగ్స్ కేసులో సంజనాను  విచారణ చేస్తోన్న పోలీసులకు ముందు ముందు ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading