Sanchari Vijay Passes Away: టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య.. దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు మరణించారు. ఇవి మరవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు సంచారి విజయ్.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలై కాసేటి క్రితమే కన్నుమూసారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇలాంటి విషాద వార్తను చెప్పడానికి మాట రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
Very very disheartening to accept that Sanchari Vijay breathed his last.
Met him couple of times just bfr this lockdown,,,, all excited about his nxt film,, tats due for release.
Very sad.
Deepest Condolences to his family and friends.
RIP ??
— Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2021
కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది. జూన్ 12 రాత్రి విజయ్ తన స్నేహితుడిని కలిసిన అనంతరం మోటార్ బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విజయ్ తల, కాలికి బలమైన గాయాలు తగిలాయి.
విజయ్ 2011లో విడుదలైన 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. విజయ్. ఈయన చివరిసారిగా 'యాక్ట్ 1978' చిత్రంలో నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kannada Cinema, Sandalwood