హోమ్ /వార్తలు /సినిమా /

సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్‌కు వేధింపులు.. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అరెస్ట్!

సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్‌కు వేధింపులు.. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అరెస్ట్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దర్శకుడుకు ప్రభుత్వం అనేక అవార్డులను కూడా అందించింది. అలాంటి అవార్డులు తీసుకున్న డైరెక్టర్ ఇలాంటి పని చేశాడంటే.. ఆయన అభిమానులు నమ్మలేకపోతున్నారు.

ప్రముఖ సినీ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పెద్ద్ హీరోయిన్‌కు ఆయన వేధింపులకు గురి చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివారాల్లోకి వెళ్తే.. మళయాళం మూవీ డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ (Sanal Kumar Sasidharan)ను కేరళ (Kerala) పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురంలో మే 5న అతడిని అదుపులోకీ తీసుకున్నారు పోలీసులు. స్టార్ హీరోయిన్ మంజు వారియర్ (Manju Warrier)  సనల్ కుమార్‌పై ఆరోపణలు చేసింది. తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంజు వారియర్ మే 4న దర్శకుడు సనల్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ.. కొచ్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు సనల్‌ను అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. మంజు వారియర్‌‌ను కొన్నేళ్లుగా సోషల్ మీడియా, ఈ మెయిల్, ఫోన్ ద్వారా వేధిస్తున్నందుకు అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

అయితే మంజు వారియర్ హీరోయిన్‌గా నటించిన ‘కయాట్టం’ (kayattam) సినిమాకు సనల్ కుమార్ దర్శకత్వం వహించాడు.ఇక అప్పటి నుంచి ఆమెను సోషల్ మీడియాలో అవమానించడానికీ ప్రయత్నిస్తున్నాడు. సనల్ అదే పనిగా మంజుకు ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో అతడి వేధింపులు భరించలేని నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది.

కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ శశిధరన్ అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. అతడు దర్శకత్వం వహించిన ‘ఓజివుదివసతేకలి’ (Ozhivudivasathe Kali) 2015లో కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అతడు తెరకెక్కించిన యస్ దుర్గ (S Durga) చిత్రం పలు వివాదాల్లో చిక్కకుంది. అయితే అలాంటి గొప్ప డైరెక్టర్ ఇలా ఓ స్టార్ హీరోయిన్‌ను ఎందుకు వేధింపులకు గురి చేస్తాడంటూ.. పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మరి ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడల్సిందే.

First published:

Tags: Breaking news, Mollywood

ఉత్తమ కథలు