Rajamoui- Samuthirakani: రాజ‌మౌళితో అన్నేళ్ల ఫ్రెండ్‌షిప్ నాది.. ఇప్పుడు అవ‌కాశం ఇచ్చాడు

రాజమౌళి సముద్రఖని

న‌టుడిగా, ద‌ర్శకుడిగా అటు త‌మిళ్, ఇటు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న స‌ముద్ర ఖ‌ని(Samuthirakani).. ఈ మ‌ధ్య తెలుగులో బిజీ అవుతున్నారు. గ‌తేడాది అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ‌పురంలో స‌ముద్ర‌ఖ‌ని పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక తాజాగా ఇటీవ‌ల విడుద‌లైన మాస్‌రాజా ర‌వితేజ(Ravi Teja) క్రాక్‌(Crack)లో న‌టించారు స‌ముద్ర‌ఖ‌ని

  • Share this:
    Rajamoui- Samuthirakani: న‌టుడిగా, ద‌ర్శకుడిగా అటు త‌మిళ్, ఇటు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న స‌ముద్ర ఖ‌ని.. ఈ మ‌ధ్య తెలుగులో బిజీ అవుతున్నారు. గ‌తేడాది అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురంలో స‌ముద్ర‌ఖ‌ని పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక తాజాగా ఇటీవ‌ల విడుద‌లైన మాస్‌రాజా ర‌వితేజ క్రాక్‌లో న‌టించారు స‌ముద్ర‌ఖ‌ని. ఈ మూవీలో అయన పాత్ర‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయ‌న విల‌నిజం సినిమాకు హైలెట్‌గా నిలిచింద‌ని విమ‌ర్శ‌కులు కామెంట్లు పెడుతున్నారు. సినిమా ప్ల‌స్‌ల‌లో ఆయ‌న కూడా ఒక‌ర‌ని అభిమానులు చెబుతున్నారు. కాగా క్రాక్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటున్న స‌ముద్ర ఖ‌ని ఆస‌క్తికర విష‌యాల‌ను చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్‌లో ఎలా అవ‌కాశం వచ్చిందో వివ‌రించారు.

    తామిద్ద‌రిది 11 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ అని, అయితే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో నటించేందుకు తన‌కు ఇప్పుడు అవ‌కాశం దొరికింద‌ని అన్నారు. ''నేను తెర‌కెక్కించిన నాడోడిగ‌ల్ సినిమా చూసి, రాజ‌మౌళి నాకు మెసేజ్ చేశాడు. అప్ప‌టి నుంచి మేమిద్ద‌రం మంచి స్నేహితులం అయ్యాము అని, అలా నాకు ఆర్ఆర్ఆర్‌లో అవ‌కాశం ఇచ్చాడు'' అని స‌ముద్ర‌ఖ‌ని చెప్పారు.

    కాగా రియ‌ల్ కారెక్ట‌ర్స్‌తో కూడిన ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపిస్తున్నారు. వారి స‌ర‌స‌న ఒలివియా, అలియా భ‌ట్ నటిస్తున్నారు. వీరితో పాటు అజ‌య్ దేవ‌గ‌న్, శ్రియ‌ స‌ముద్ర ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఈ ఏడాది ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తాన‌ని రాజ‌మౌళి ఇటీవ‌ల మాటిచ్చారు. బాహుబ‌లి త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published: